Sachin Tendulkar: స‌చిన్ టెండూల‌ర్క‌ర్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌.. ఎల్ల‌ప్పుడూ కృతజ్ఞుడనని నోట్‌..!

2 ఏప్రిల్ 2011 తేదీని ఏ భారతీయుడు మరచిపోలేడు. MS ధోని ఐకానిక్ సిక్స్‌తో టీమ్ ఇండియా ICC వరల్డ్ కప్ 2011 టైటిల్‌ను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమ్ ఇండియా తొలి ప్రపంచకప్ గెలిచింది. అప్పటికి సచిన్ టెండూల్కర్ వయసు 10 ఏళ్లు.

Sachin Tendulkar: 2 ఏప్రిల్ 2011 తేదీని ఏ భారతీయుడు మరచిపోలేడు. MS ధోని ఐకానిక్ సిక్స్‌తో టీమ్ ఇండియా ICC వరల్డ్ కప్ 2011 టైటిల్‌ను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమ్ ఇండియా తొలి ప్రపంచకప్ గెలిచింది. అప్పటికి సచిన్ టెండూల్కర్ వయసు 10 ఏళ్లు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 10 ఏళ్ల వయసులో టీమ్ ఇండియాకు ఆడి ప్రపంచకప్ గెలవాలని కలలు కన్నాడు. సచిన్ టెండూల్కర్ భారతదేశం కోసం ఆరు ప్రపంచ కప్‌లు ఆడాడు. అతని కల 2011లో నెరవేరింది. అయితు సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో 2011 ప్రపంచ కప్ ఫోటోను షేర్ చేయడం ద్వారా కొన్ని మాట‌ల‌ను పంచుకున్నారు.

We’re now on WhatsAppClick to Join.

సచిన్ టెండూల్కర్ ఇలా వ్రాశాడు. 13 సంవత్సరాల క్రితం నా చిన్ననాటి కల నిజమైంది. ఆ జ్ఞాపకాల కోసం, జట్టు కోసం, బిలియన్ల మంది ప్రజల మద్దతు కోసం నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ భారత జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరు వికెట్లకు 274 పరుగులు చేసింది. దీంతో చేధనకు దిగిన భారత్ 31 పరుగుల వద్ద వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వికెట్లను కోల్పోయింది. దీని తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి గౌతమ్ గంభీర్ స్కోరును 114 పరుగులకు తీసుకెళ్లాడు. విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ధోనీ 79 బంతుల్లో 91 పరుగులు చేశాడు. 122 బంతుల్లో 97 పరుగులు చేసి గంభీర్ ఔటయ్యాడు. అనంతరం యువరాజ్ సింగ్ తో కలిసి ధోనీ మిగిలిన టార్గెట్ ను చేధించారు. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ధోనీ అందుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను యువరాజ్ సింగ్ తీసుకున్నాడు.

Also Read: CM Revanth Reddy: కేసీఆర్ చెల్లని 1000 నోటు: సీఎం రేవంత్