Site icon HashtagU Telugu

Ranji Trophy: గేర్ మార్చిన పుజారా… మరో శతకం కొట్టిన వెటరన్ బ్యాటర్

Ranji Trophy

Ranji Trophy

Ranji Trophy: సెలెక్టర్లు పట్టించుకోకున్నా భారత వెటరన్ బ్యాటర్ చటేశ్వర పుజారా మాత్రం తన బ్యాట్ తోనే సమాధానం చెబుతున్నాడు. వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారా రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున సెంచరీల మోత మోగిస్తున్నాడు. అంతేకాదు తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. పుజారా అంటే క్రికెట్ ‌లవర్స్‌కు గుర్తొచ్చేది బలమైన డిఫెన్స్. కానీ రంజీ ట్రోఫీలో మణిపుర్ జట్టుపై పుజారా దూకుడుగా పరుగులు సాధించాడు. 105 బంతుల్లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102.86 స్ట్రైక్‌రేటుతో చెలరేగాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా తన శైలికి విరుద్ధంగా బౌండరీల మోత మోగించడం ఆకట్టుకుంది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 63వ సెంచరీ. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి కంటే అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు సునీల్‌ గవాస్కర్‌ , సచిన్‌ టెండూల్కర్‌ , రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే. కాగా, 36 ఏళ్ల పుజారా టీమిండియాకు దూరమై దాదాపు ఎనిమిది నెలలు దాటింది. సెలెక్టర్లు శుభ్‌మన్ గిల్‌కు మూడో స్థానంలో అవకాశం ఇచ్చారు. ఓపెనర్‌గా సత్తాచాటిన గిల్ వన్‌డౌన్‌లో విఫలమయ్యాడు. మొత్తంగా లయ అందుకుని వైజాగ్ టెస్టులో సెంచరీ సాధించాడు.
మరోవైపు టీమిండియాలో తిరిగి చోటు సంపాదించాలని పుజారా రంజీ ట్రోఫీలో కసిగా పరుగులు సాధిస్తున్నాడు.

Also Read: Kovur Constituency : కోవూరులో టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ పోటీ