Site icon HashtagU Telugu

BCCI New Selection Committee: చీఫ్ సెలెక్టర్ గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్..?

Venkatesh Prasad

Resizeimagesize (1280 X 720) (1) 11zon

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వచ్చే వారం కొత్త సెలక్షన్ కమిటీ (New Selection Committee)ని ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు కొత్త కమిటీ జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు. సెలక్షన్ కమిటీకి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు డిసెంబర్ 29న క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశం కూడా జరిగింది. రిపోర్ట్ ప్రకారం.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ చీఫ్ సెలెక్టర్ కావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

ఇది కాకుండా తొలగించబడిన చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సెలక్షన్ కమిటీలో కొనసాగడం ఖాయం. కానీ సౌత్ జోన్ నుంచి వెంకటేష్ ప్రసాద్ రావడంతో చీఫ్ సెలక్టర్ గా చేతన్ కొనసాగే అవకాశం లేదు. చేతన్ శర్మ కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన అనుభవం వెంకటేష్ ప్రసాద్‌కు కూడా ఉంది. చేతన్ శర్మ భారత్ తరఫున 26 టెస్టులు ఆడగా, వెంకటేష్ ప్రసాద్ 33 టెస్టుల్లో పాల్గొన్నాడు.

బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చేతన్‌కు మంచి అవకాశం ఉంది. అందుకే అతను మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. మాకు చాలా దరఖాస్తులు వచ్చాయి. కానీ చేతన్, వెంకటేష్ ఇద్దరు అర్హులైన అభ్యర్థులు. చేతన్, హర్విందర్‌లకు రెండవ అవకాశం ఇవ్వాలా వద్దా అనేది CAC నిర్ణయం. జనవరి మొదటి వారంలోగా కొత్త సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కొత్త ఎంపిక కమిటీ (అంచనా)
అధ్యక్షుడు: వెంకటేష్ ప్రసాద్ (సౌత్ జోన్)
వెస్ట్ జోన్: సలీల్ అంకోలా
ఈస్ట్ జోన్: శివసుందర్ దాస్
నార్త్ జోన్: చేతన్ శర్మ
మిడిల్ జోన్: హర్విందర్ సింగ్

సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. దీని ప్రకారం కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 ODIలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కనీసం ఐదేళ్ల క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ కూడా ఇచ్చి ఉండాలి. ఇది మాత్రమే కాదు.. అభ్యర్థి BCCI ఏ కమిటీలో సభ్యుడుగా ఉండకూడదు. తదుపరి 5 సంవత్సరాలు బోర్డుకు సేవ చేయగలగాలి.

53 ఏళ్ల వెంకటేష్ ప్రసాద్ భారత్ తరఫున మొత్తం 161 వన్డేలు ఆడి 196 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 33 టెస్ట్ మ్యాచ్‌లలో 96 వికెట్లు తీశాడు. వెంకటేష్ ప్రసాద్ వన్డేల్లో ఒకసారి, టెస్టు క్రికెట్‌లో ఏడుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. వెంకటేష్ ప్రసాద్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా పని చేసాడు. బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీకి సంబంధించిన ఇంటర్వ్యూలను జనవరి 2న నిర్వహించనుంది. అశోక్ మల్హోత్రా నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ ఇంటర్వ్యూలను వర్చువల్ పద్దతిలో నిర్వహించనుంది. దీనిలో మొత్తం 50 మంది పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసియా కప్,టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కారణంగా చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది.