Site icon HashtagU Telugu

Chetan Sharma: బీసీసీఐలోకి చేతన్ శర్మ రీ ఎంట్రీ

Chetan Sharma

Resizeimagesize (1280 X 720)

Chetan Sharma: మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) బీసీసీఐ (BCCI)లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఓ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్‌ శర్మ అడ్డంగా దొరికిపోయాడు. టీమిండియా ఫేక్ ఫిట్ నెస్ సీక్రెట్స్, ఆటగాళ్ల ఎంపిక, విశ్రాంతి పేరుతో ఆటగాళ్లను ఆటకూ దూరం చేసే వారి వివరాలతో పాటు మరికొన్ని కీలక విషయాలు చెప్పేశాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన గొడవల గురించి.. కోహ్లీకి, రోహిత్ శర్మ మధ్య ఉన్న ఈగో గొడవ వంటి పలు అంశాలపై ఆ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ మాట్లాడాడు. ఇది తీవ్ర దుమారం రేపడంతో అతడు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ గా తప్పుకోవాల్సి వచ్చింది.

దాదాపు నాలుగు నెలల నుంచీ ఎవరికీ కనిపించని చేతన్‌ శర్మ తాజాగా మరోసారి సెలక్షన్‌ కమిటీలో బాధ్యతలు చేపట్టాడు. జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా కాకుండా నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ టీమ్ కు సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు. బీసీసీఐ నుంచీ కూడా దీనికి ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చేతన్ శర్మ సారథ్యంలోని కమిటీ దులీప్ ట్రోఫీ కోసం నార్త్ జోన్ జట్టుకు మన్‌దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది.

Also Read: Whitehouse: చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు.. ఒకే ఓవర్ లో 6వికెట్లు?

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరాలు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు. కాగా ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కు అజయ్ రాత్ర హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు.