Site icon HashtagU Telugu

MS Dhoni: చెస్ ఒలింపియాడ్ ముగింపు వేడుకలకు గెస్ట్ ఎవరో తెలుసా ?

Dhoni (1)

Dhoni (1)

తొలిసారి ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇస్తున్న భారత్ ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయింది. నేటితో ఈ టోర్నీ తెర పడనుండగా…పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఆరంభ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించింది. ప్రధాని మోడీ , తమిళనాడు సీఎం స్టాలిన్ తో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ముగింపు వేడుకులను సైతం అదే రితీలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ఈ టోర్నీకి గుడ్ బై చెప్పేందుకు ఏర్పాట్లు చేసింది. నేడు జరిగే టోర్నీ ముగింపు వేడుకలకు ధోనీ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీకి తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఉంది. గత 14 ఏళ్లుగా అతను ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే
చెస్‌ ఒలింపియాడ్‌ మహిళల విభాగంలో కోనెరు హంపీ సారథ్యంలోని భారత్‌-ఏ జట్టు టైటిల్‌ రేసులో ముందుంది. కీలకమైన పదో రౌండ్లో 3.5-0.5తో కజకిస్థాన్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. జన్సాయాపై హంపి, బలబయేవాపై తానియా, నక్బయేవాపై భక్తి నెగ్గగా.. అసౌబయేవాతో గేమ్‌ను వైశాలి డ్రాగా ముగించింది. టోర్నీలో మరో రౌండ్‌ మాత్రమే మిగిలి ఉంది. పోలెండ్‌ రెండో స్థానంలో ఉంది.
భారత్‌-బీ ఆరో స్థానంలో, భారత్‌-సీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఓపెన్‌ విభాగం పదో రౌండ్లో ఉజ్బెకిస్థాన్‌తో మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించిన భారత్‌-బీ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది.