Fleming: చెన్నై సత్తా ఏంటో చూపిస్తాం – ఫ్లెమింగ్

నాలుగు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి వరుస ఓటములతో అభిమానుల్ని దారుణంగా నిరాశపరుస్తోంది.

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 08:20 AM IST

నాలుగు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి వరుస ఓటములతో అభిమానుల్ని దారుణంగా నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌ చేతిలో కూడా 6 వికెట్ల తేడాతో అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో 54 పరుగుల తేడాతో, చివరగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో దారుణ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములపై తాజాగా ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్పందించాడు.. ఈ సీజన్ లో మేము అన్ని విభాగాల్లో మెరుగుపడాల్సి న అవసరముంది.

కొంత మంది కీలక ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రోనిలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోవడం మమ్మల్ని చాలా బాధిస్తోంది. ఏదేమైనా మాకు ప్లే ఆఫ్స్ కు చేరేందుకు ఇంకా అవకాశం ఉంది రాబోయే మ్యాచుల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళతామని కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ సత్తా ఏంటో చూపిస్తామని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.. అలాగే జట్టులో దీపక్‌ చహర్‌ వంటి కీలక ఆటగాడు లేని లోటు స్పష్టంగా తెలుస్తుందన్న ఫ్లెమింగ్‌..ఏదేమైనా తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2022 సీజన్ కు 2 రోజుల ముందుఎంఎస్‌ ధోని ఈ సీజన్‌తో కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు చెన్నై యాజమాన్యం జట్టు సారథ్య బాధ్యతల్ని అందించింది. అయితే, బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించే రవీంద్ర జడేజా సారథిగా మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు.