CSK vs LSG: చెపాక్ లో చెన్నై చెడుగుడు.. లక్నో పై విజయం

ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. సొంత గడ్డపై అదరగొట్టిన ధోనీ టీమ్ లక్నో సూపర్ కింగ్స్ ను ఓడించింది. బ్యాటింగ్ లో రుతురాజ్ మెరుపులు,

  • Written By:
  • Updated On - April 4, 2023 / 12:15 AM IST

IPL 2023 CSK vs LSG : ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బోణీ కొట్టింది. సొంత గడ్డపై అదరగొట్టిన ధోనీ టీమ్ లక్నో సూపర్ కింగ్స్ ను ఓడించింది. బ్యాటింగ్ లో రుతురాజ్ మెరుపులు, బౌలింగ్ లో మోయిన్ అలీ రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని అందించారు.

ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కైల్ మేయర్స్ వేసిన తొలి ఓవర్‌లో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లతో 17 పరుగులు పిండుకుంది.కృష్ణప్ప గౌతమ్ వేసిన ఐదో ఓవర్‌లో రుతురాజ్ మూడు భారీ సిక్స్‌లు బాది 20 పరుగులు చేశాడు. దీంతో చెన్నై.. ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే చెన్నై 79 పరుగులు సాధించింది.

ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రుతురాజ్ 57, కాన్వే 47రన్స్ కి ఔటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే ధాటిగా ఆడే ప్రయత్నంలో 27 పరుగులకు ఔటవ్వగా.. మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా విఫలమయ్యారు. అయితే అంబటి రాయుడితో కలిసి ధోనీ భారీ సిక్స్‌లు బాదడంతో చెన్నై 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.

భారీ లక్ష్య చేధనలో లక్నో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు కే ఎల్ రాహుల్, కైల్ మేయర్స్ అదరగొట్టారు. తొలి వికెట్ కు 5.3 ఓవర్లలో 79 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. రాహుల్ 20 రన్స్ కు వెనుదిరగ్గా… మేయర్స్ భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. కేవలం 22 బంతుల్లో 8 ఫోర్లు , 2 సిక్సర్లతో 53 రన్స్ చేశాడు. అయితే తర్వాత క్రునాల్ పాండ్య , దీపక్ హుడా నిరాశ పరిచారు. ఈ దశలో స్టోయినిస్, నికోలస్ పూరన్ ధాటిగా ఆడడంతో లక్నో ఆశలు నిలిచాయి. వీరిద్దరూ ఔటయ్యాక… బదౌనీ, కృష్ణప్ప గౌతమ్ పోరాడినా ఫలితం లేకపోయింది. చివర్లో చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో లక్నో జోరుకు బ్రేక్ వేశారు. దీంతో లక్నో 205 పరుగులే చేయగలిగింది.చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 4 వికెట్లు పడగొట్టాడు.

Also Read:  IPL 2023 Impact Players: IPL జట్ల విజయానికి ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎందుకు కీలకం?