Site icon HashtagU Telugu

CSK All Out : ముంబై దెబ్బకు కుదేలైన చెన్నై..ముంబై ముందు టార్గెట్ ఇదే..!!

Sams Mumbai Indians

Sams Mumbai Indians

IPLలో కీలకమైన మ్యాచ్ లో చెన్నై తడబడింది. ముంబై బౌలర్లు విజ్రుంభించి ఆడటంతో చెన్నై బ్యాటింగ్ లైనప్ పేకమేడల్లా కూలిపోయింది. 16 ఓవర్లు మాత్రమే ఆడిన చెన్నై జట్టు 97 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ msధోనీ మనిహా ఎవరూ రాణించలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై 97 పరుకులకే దారుణంగా కుప్పకూలింది.

దీంతో ముంబై 98పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ముంబై బౌలర్ల ధాటికి ముగ్గురు చెన్నై బ్యాట్స్ మెన్స్ డేవన్ కాన్వే, మొయిన్ అలీ, తీక్షణ డకౌట్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ 7, రాబిన్ ఉతప్ప 1, అంబటి రాయుడు 10, శివమ్ దూబే 10, డ్వేన్ బ్రావో 12, ముకేశ్ చౌదరి 4 పరుగులు మాత్రమే చేశారు. ధోని తర్వాత అత్యధిక స్కోరు అదనపు పరుగులు మాత్రమే. మ్యాచ్ కరెంట్ ప్రాబ్లమ్ తో డీఆరెఎస్ అందుబాటులో లేకపోవడం కూడా చెన్నైకి కలిసిరాలేదని చెప్పాలి.