MI vs CSK; రోహిత్ సెంచ‌రీ చేసినా… ముంబైకి త‌ప్ప‌ని ఓటమి

హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇదే గ్రౌండ్ లో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తున్న హార్దిక్ సేన చెన్నై సూపర్ కింగ్స్ కు ముందు తలొగ్గింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

MI vs CSK; హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇదే గ్రౌండ్ లో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తున్న హార్దిక్ సేన చెన్నై సూపర్ కింగ్స్ కు ముందు తలొగ్గింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. జట్టు తరఫున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 69 పరుగులతో, శివమ్ దూబే 66 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. కాగా చివరి ఓవర్లో ఎంఎస్ ధోని కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. 500 స్ట్రైక్ రేట్ మైంటైన్ చేసిన మాహీ చివరి బంతుల్లో మూడు సిక్సర్లు బాది వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. హార్దిక్ పాండ్య వేసిన చివ‌రి ఓవ‌ర్‌లో చెన్నై 26 పరుగులు పిండుకుంది. ముంబై బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీసుకున్నాడు.

సీఎస్‌కే నిర్దేశించిన 207 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ 63 బంతుల్లో 105 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.కానీ అతని ఇన్నింగ్స్ జట్టును విజయపథంలో నడిపించలేకపోయింది. రోహిత్ కి ఒక్కరు కూడా సహకారం అందించలేకపోయారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 23 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య డకౌట్ తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా రాణించలేకపోయాడు. తొలి బంతి నుంచి త‌డ‌బ‌డిన‌ హార్దిక్ పాండ్యా(2) లెగ్‌సైడ్‌లో బౌండ‌రీ వ‌ద్ద జ‌డేజాకు చిక్కాడు. ఇక ముంబై హిట్ట‌ర్ టిమ్ డెవిడ్ వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు బాదడంతో ముంబై ఆశలు చిగురించాయి. కానీ అతను 13 పరుగులకే చాపచుట్టేశాడు. బౌండ‌రీ వ‌ద్ద ర‌వీంద్ర‌కు దొరికిపోయాడు.

We’re now on WhatsApp : Click to Join

బిగ్ హిట్టర్లంతా డ‌గౌట్‌కు చేర‌డంతో దాదాపు ముంబై ఓట‌మి ఖారారైంది. ఆఖ‌రి ఓవ‌ర్లో బౌండ‌రీతో సెంచ‌రీ పూర్తి చేసుకున్న‌ హిట్‌మ్యాన్ చివ‌రిదాకా పోరాడినా ముంబైని గెలిపించ‌లేక‌పోయాడు. బౌలింగ్‌లో మతిష పతిరన 28 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ బృందం నాలుగో విజ‌యం సాధించ‌గా.. ముంబై నాలుగో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది.

Also Read: MI vs CSK; రోహిత్ సెంచ‌రీ చేసినా ముంబైకి త‌ప్ప‌ని ఓటమి