ICC T20 World Cup 2024: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొన‌బోయే ముఖ్య‌మైన‌ జ‌ట్ల వివ‌రాలివే..!

9వ టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 1 నుంచి జూన్‌ 29 వరకు వెస్టిండీస్‌, అమెరికాలో జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో 20 దేశాల జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి.

  • Written By:
  • Updated On - May 4, 2024 / 07:47 AM IST

ICC T20 World Cup 2024: 9వ టీ20 ప్రపంచకప్‌ (ICC T20 World Cup 2024) జూన్‌ 1 నుంచి జూన్‌ 29 వరకు వెస్టిండీస్‌, అమెరికాలో జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో 20 దేశాల జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ కూడా ప్రపంచకప్‌ కోసం తమ తమ జట్లను ప్రకటించాయి. నమీబియా, ఉగాండా, కెనడా వంటి జట్లు క్వాలిఫికేషన్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరచడంతో 20 జట్లలో చోటు దక్కించుకోగలిగాయి.

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాద‌వ్, యుజ్వేంద్ర చాహ‌ల్‌, అర్ష్‌దీప్‌ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ట్రావెలింగ్ రిజర్వ్ (గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్).

ఆస్ట్రేలియా జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ వార్నర్, మాథ్యూ వేడ్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

ఇంగ్లండ్ జట్టు

జోస్ బట్లర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ఫిల్ సాల్ట్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రాన్, టామ్ హార్ట్‌లీ, విల్ జాక్వెస్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.

Also Read: MI vs KKR: 12 ఏళ్ల తర్వాత వాంఖడేలో ముంబైపై కేకేఆర్‌ విజయం

న్యూజిలాండ్ జట్టు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ. ట్రావెలింగ్ రిజర్వ్ (బెన్ సియర్స్)

We’re now on WhatsApp : Click to Join

దక్షిణాఫ్రికా జట్టు

ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడా, ర్యాన్ రికెల్‌బ్స్సీ, తబ్రయిజ్ ష‌మ్సీ. పాకిస్థాన్ జ‌ట్టు మే 24 లేదీ 25వ తేదీల్లోపు జ‌ట్టును ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఐసీసీకి తెలిపింది.