Site icon HashtagU Telugu

Bumrah Master Plan: పెర్త్ టెస్టులో మార్పులు.. బుమ్రా మాస్టర్ ప్లాన్!

India Test Vice Captain

India Test Vice Captain

Bumrah Master Plan: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరాలనే లక్ష్యంతో టీమిండియా మరో టెస్టు సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. ఈ పరిస్థితిలో అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah Master Plan) మొదటి టెస్టులో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడింది. సొంతగడ్డపై భారత్ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. రోహిత్, కోహ్లీ లాంటి సేనియర్లున్న జట్టు కివీస్ బౌలర్లకు దాసోహమైంది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో భారత్ ఆ తప్పులను సరి చేయాల్సిన అవసరమొచ్చింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా రాణిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ ఆడవచ్చు. ఈ ట్రోఫీని భారత్ నాలుగు సున్నతో గెలిస్తేనే ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంది. పాట్ కమిన్స్ సారధ్యంలో ఆస్ట్రేలియా జట్టు బలంగా కనిపిస్తుంది. స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వంటి బలమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పాకిస్థాన్ చేతిలో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఆ జట్టు టార్గెట్ టీమిండియానే. టీమిండియాపై ఆసీస్ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది. పైగా ఈ సిరీస్ కూడా ఆస్ట్రేలియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ కోసం ఇరు జట్లకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టార్గెట్ కావడంతో ఆస్ట్రేలియా ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు.

Also Read: Colgate : కోల్‌గేట్ ఓరల్ హెల్త్ మూవ్‌మెంట్‌ను ఏఐ- పవర్డ్ స్క్రీనింగ్‌లతో ప్రారంభం

టీమిండియా విషయానికి వస్తే.. జట్టు కూర్పు ఆల్వేస్ అల్టిమేట్ అనే చెప్పాలి. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా , యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఇలా జట్టులో మంచి ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారు. అయితే బుమ్రా జట్టులో లేని దేవదత్ పడిక్కల్‌కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆస్ట్రేలియా-ఏతో జరిగిన టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి పడిక్కల్ నాలుగో స్థానంలో 276 బంతులు ఎదుర్కొని 124 పరుగుల చేశాడు. దీంతో పడిక్కల్‌కు బుమ్రా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ స్థానంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ మధ్య పోటీ ఉంది. ఇద్దరిలో బుమ్రా ఎవరికీ అవకాశమిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా టీమిండియాలో ఆత్మవిశ్వాసం లోపించింది అంటే ప్రత్యర్థి జట్టును ఎదుర్కోవడం అంత సులువు కాదు. తాజాగా బుమ్రా కూడా ఇదే చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన బుమ్రా.. ఆత్మవిశ్వాసం ముఖ్యమని చెప్పాడు. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగితే విజయం ఈజీ అవుతుందన్నాడు.