Site icon HashtagU Telugu

Harshit Rana : కేకేఆర్ మీద ప్రేమతోనే హర్షిత్ రాణాకు అవకాశం?

Harshit Rana

Harshit Rana

అడిలైడ్ వేదిక(Adelaide Venue )గా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా (Australia)10 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీతో కదం తొక్కగా లబుషెన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే టీమిండియా బ్యాటర్లు(Team India batters) రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్ సమమైంది. ఈ టెస్ట్ ఓడిపోవడంతో కోచ్ గంభీర్ పై విమర్శల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా హర్షిత్ రాణా (Harshit Rana) ఎంపిక కారణంగా గంభీర్ కార్నర్ అవుతున్నాడు.

హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయడం వెనుక అసలైన కారణం ఉందట. హర్షిత్ రానా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. గత సీజన్లో గంభీర్ ఆ జట్టుకు మెంటర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే హర్షిత్ రాణాను గంభీర్ జట్టులోకి తీసుకొచ్చాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా రాణా అరంగేట్రం చేశాడు. హర్షిత్ రాణా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేశాడు. ట్రావిస్ హెడ్ వంటి బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ కు చేర్చాడు. హర్షిత్ రాణా తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అయితే రెండో మ్యాచ్‌లో అతనికి వికెట్లు దక్కలేదు. కాగా కేకేఆర్‌ పై ఉన్న అభిమానంతోనే గంభీర్‌ హర్షిత్ రాణాకు ప్రాధాన్యత ఇస్తున్నాడని కామెంట్స్ వినిపించాయి. మరోవైపు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

రాణాను టెస్టు జట్టులో ఎంపిక చేయడం గంభీర్‌ నిర్ణయం ఒక్కడిదే కాదని, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా గంభీర్ కు మద్దతు ఇచ్చినట్లు ఇంగ్లీష్ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. రెండో టెస్టు మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రాణా ఎంపికపై రోహిత్‌ను విలేకరులు ఓ ప్రశ్న అడగగా.. తొలి మ్యాచ్‌లో హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడని రోహిత్ చెప్పాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టును ఆదుకున్నాడని అన్నాడు. అయితే హర్షిత్ రానాను ఎంపిక చేసింది అతని దేశవాళీ గణాంకాలను బట్టేనని గంభీర్ టీం చెబుతుంది. ఎందుకంటే హర్షిత్ రాణా ఐపీఎల్‌లో కేకేఆర్ తరుపున కంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని గణాంకాలు బావున్నాయి. దేశవాళీ మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన చూసి ఎంపిక చేసేందుకు గంభీర్ మొగ్గు చూపాడని గంభీర్ టీం సభ్యులు అంటున్నారు.

Read Also : Bharati Kolli : బొబ్బిలి టు చైనా.. అతిపెద్ద చైనా బ్యాంకులో తెలుగు మహిళకు కీలక పదవి