Champions Trophy Prize Money: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ఒక వారం కంటే తక్కువ సమయం ఉంది. ఈసారి ఈ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోన్న ‘హైబ్రిడ్ మోడల్’లో ఆడనుంది. దీని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోని మూడు నగరాలు (లాహోర్, రావల్పిండి, కరాచీ), దుబాయ్‌లో జరుగుతాయి. ఫిబ్రవరి 19న కరాచీలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.
ప్రైజ్ మనీలో భారీగా పెరుగుదల
తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని (Champions Trophy Prize Money) ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత జట్టు $2.24 మిలియన్ (సుమారు రూ. 19.46 కోట్లు) అందుకుంటుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9.73 కోట్లు) అందుతాయి. సెమీ-ఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు ఒకే మొత్తంలో $560,000 (సుమారు రూ. 4.86 కోట్లు) లభిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ ముఖ్యం. గ్రూప్ దశలో మ్యాచ్ గెలిస్తే జట్టుకు $34000 (సుమారు రూ. 29.53 లక్షలు) లభిస్తుంది. ఐదు, ఆరవ స్థానాల్లో నిలిచిన జట్లకు అదే మొత్తంలో $350,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుతాయి. ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లకు అదే మొత్తంలో 140,000 డాలర్లు (దాదాపు రూ. 1.22 కోట్లు) లభిస్తాయి. ఇది కాకుండా ఈ పోటీలో పాల్గొన్నందుకు మొత్తం ఎనిమిది జట్లకు $125,000 (సుమారు రూ. 1.09 కోట్లు) ఇవ్వనున్నారు. ICC ఈ టోర్నమెంట్‌లో మొత్తం $6.9 మిలియన్ల (సుమారు రూ. 60 కోట్లు) ప్రైజ్ మనీని పంపిణీ చేస్తుంది. ఇది 2017 కంటే 53 శాతం ఎక్కువ.
Also Read: KKR-RCB: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్!
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ: (USD డాలర్లు)
- విజేత జట్టు: $2.24 మిలియన్ (రూ. 19.46 కోట్లు)
- రన్నరప్: $1.24 మిలియన్ (రూ. 9.73 కోట్లు)
- సెమీఫైనలిస్ట్: $5,60,000 (రూ. 4.86 కోట్లు)
- ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న జట్లు: $3,50,000 (రూ. 3.04 కోట్లు)
- ఏడో లేదా ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టు: $1,40,000 (రూ. 1.22 కోట్లు)
- గ్రూప్ దశ విజయం: $1,40,000 (రూ. 1.22 కోట్లు)
- హామీ డబ్బు: $1,25,000 (రూ. 1.09 కోట్లు)