Site icon HashtagU Telugu

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ ధరలను ప్రకటించిన పీసీబీ.. చీప్ అంటున్న ఫ్యాన్స్

Pakistan Refunds

Pakistan Refunds

Champions Trophy: ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో పాల్గొననుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈసారి ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భద్రత కారణాల దృష్ట్యా భారత్ ఆడబోయే మ్యాచులన్నీ హైబ్రిడ్ మోడల్ ప్రకారం దుబాయ్‌లో జరుగుతాయి. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ టిక్కెట్ ధరలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. అయితే కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల వివరాలను మాత్రమే ప్రకటించారు. దుబాయ్ వేదికగా జరిగే భారత మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల వివరాలను ప్రస్తావించలేదు. మరి భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ టికెట్లకు ఎంత రేటు నిర్ణయిస్తారో చూడాలి.

టికెట్ ధరలను వీవీఐపీ, వీఐపీ, ప్రీమియం, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్‌ ఇలా వేర్వేరుగా విభజించారు. గ్యాలరీ టికెట్ ధర 25 వేలుగా కాగా వీవీఐపీ సీట్ల ధరను 20 వేలకు అమ్ముతున్నారు. వీఐపీ టిక్కెట్ల ధర 12000గా నిర్ణయించారు. ఇది కాకుండా ప్రీమియర్ ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ టిక్కెట్ ధరలు 7000, 4000 మరియు రెండు వేలకు నిర్ణయించారు. అయితే ఇదంతా పాకిస్తాన్ కరెన్సీ ప్రకారమే ఉంటుంది. ఇండియా కరెన్సీలో జనరల్ టికెట్ చూస్తే 370 రూపాయలు మాత్రమే. క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీకి టిక్కెట్లు కొనాలనుకుంటే ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 20న భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 23న భారత్-పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది.

Also Read: Sanju Samson: జోఫ్రా ఆర్చర్ కి చుక్కలు చూపించనున్న సంజూ

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న జరగనుంది. టోర్నీలో ఫైనల్ మ్యాచ్ తో కలిపి మొత్తం 15 మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. అంటే ఒక్కో గ్రూపులో నాలుగు టీమ్ లు ఉంటాయి. గ్రూప్ – ఏ లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. గ్రూప్ – బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.