Site icon HashtagU Telugu

South Africa: సౌతాఫ్రికా మ‌రో స్టార్ ఆట‌గాడికి గాయం.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరం?

South Africa

South Africa

South Africa: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ క్ర‌మంలోనే దక్షిణాఫ్రికా (South Africa) జట్టు సమస్యలు మాత్రం తగ్గడం లేదు. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయం సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు మ‌రో కీల‌క ఆట‌గాడు గాయ‌ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రస్తుత దక్షిణాఫ్రికా 20 సీజన్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో సోమవారం (జనవరి 27) జరిగిన మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన ఆటగాడు డేవిడ్ మిల్లర్ గాయపడ్డాడు.

ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు

డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో బంతిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు గాయ‌మైంది. దీంతో మిల్లర్ రాయల్స్ సహాయక సిబ్బందితో కలిసి మైదానాన్ని వీడాల్సి వ‌చ్చింది. జాగ్రత్తగా మెట్లు ఎక్కి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. మ్యాచ్ అనంతరం మిల్లర్ తొడ కండ‌రాల స‌మ‌స్య‌తో మైదానాన్ని వీడినట్లు వెల్లడించాడు.

Also Read: Oben Rorr EZ: కేవ‌లం రూ. 90వేల‌కు ఎల‌క్ట్రిక్ బైక్‌.. 45 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్‌!

స్టార్ ప్లేయ‌ర్‌ల‌కు గాయాలు

గాయం కాస్త తీవ్రంగానే ఉంద‌ని మిల్ల‌ర్ పేర్కొన్నాడు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని మిల్ల‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇదే స‌మ‌యంలో లుంగీ ఎన్‌గిడి కూడా వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని ఫిట్‌నెస్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వెన్ను గాయం కారణంగా ఇప్ప‌టికే ఎన్రిక్ నోర్ట్జే ఛాంపియన్స్ ట్రోఫీకి దూర‌మ‌య్యేలా ఉన్నాడు. అలాగే గెరాల్డ్ కోయెట్జీ కూడా స్నాయువు సమస్యతో బాధపడుతున్నాడు. వీరితో పాటు నాండ్రే బెర్గర్, లిజాడ్ విలియమ్స్, డారిన్ డుపావిలాన్, వియాన్ ముల్డర్, ఒట్నియెల్ బార్ట్‌మన్ కూడా గాయపడ్డారు. ఇలాంటి స్టార్ ప్లేయ‌ర్‌లకు గాయాలు కావ‌డంతో సౌతాఫ్రికా జ‌ట్టు చిక్కుల్లో ప‌డుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టు