Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy) టీమిండియా ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం ద్వారా టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు రోహిత్ అండ్ కంపెనీ తదుపరి మ్యాచ్ న్యూజిలాండ్‌తో మార్చి 2న జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అతిపెద్ద మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌కు రెస్ట్ ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డారెన్ గోఫ్ ఓ సలహా ఇచ్చాడు.
షమీకి విశ్రాంతి
న్యూజిలాండ్‌తో మూడో లీగ్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డారెన్ గోఫ్ మాట్లాడుతూ.. టీమిండియా బహుశా షమీకి విశ్రాంతి ఇవ్వొచ్చు. పాకిస్థాన్‌పై టీమిండియా అద్భుతంగా రాణించింది. జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు మరో స్పిన్నర్‌ని ప్రయత్నించవచ్చు. దుబాయ్‌లో మరొక స్పిన్నర్‌ని తీసుకోవచ్చు. టీమ్ ఇండియా ఇప్పటికే సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. కాబట్టి న్యూజిలాండ్‌తో మ్యాచ్ కేవలం నామమాత్రంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుండి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వొచ్చని ఆయన అంచనా వేశారు.
పాకిస్థాన్‌పై షమీ నిరాశపర్చాడు
చాలా కాలం తర్వాత మహ్మద్ షమీ మళ్లీ టీమ్ ఇండియాలోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శించిన షమీ ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. పాకిస్థాన్‌పై షమీ బౌలింగ్ బాగానే ఉంది. ఈ మ్యాచ్‌లో షమీ 8 ఓవర్లలో 43 పరుగులు చేసినప్పటికీ అతనికి వికెట్ దక్కలేదు. షమీ మ్యాచ్ ప్రారంభంలో కొంత ఇబ్బంది పడుతూ కనిపించాడు. దీని కారణంగా అతను కొంత సమయం మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. మరి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో షమీకి విశ్రాంతినిస్తారా లేదా అనేది చూడాలి.
ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఫిబ్రవరి 23న పాక్‌తో జరిగిన పోరులో భారత్ జట్టు ఘనవిజయం సాధించి సెమీస్‌కు బెర్త్‌ను ఖరారు చేసుకుంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను మార్చి 2వ తేదీన కివీస్‌తో ఆడనుంది.