Mohammed Shami: బంగ్లాదేశ్‌పై మహ్మద్ షమీ (Mohammed Shami) 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. పరిమిత ఓవర్ల ఐసీసీ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ విషయంలో అతను జహీర్ ఖాన్ రికార్డును సైతం బద్ధలు కొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. అతను జకర్ అలీ రూపంలో తన 200వ వన్డే వికెట్‌ను పూర్తి చేశాడు. మిచెల్ స్టార్క్ తర్వాత వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్ మహ్మద్ షమీకి 104వ వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో షమీ తొలి ఓవర్‌లోనే వికెట్ తీశాడు. అతను సౌమ్య సర్కార్‌ను సున్నా వద్ద బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలోనే మెహందీ హసన్ రూపంలో మరో భారీ వికెట్‌ను తీశాడు. జాకర్ అలీ 68 పరుగులు చేసి ఆడుతుండగా.. 43వ ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో షమీ తన 200వ వన్డే వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా షమీ నిలిచాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్‌లలో ఈ సంఖ్యను సాధించి నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. షమీ 104 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు.
Also Read: India vs Bangladesh: బంగ్లాదేశ్‌పై చెలరేగిన షమీ.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
200 వికెట్లు తీసిన 8వ భారత బౌలర్
భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. 271 మ్యాచ్‌ల్లో 337 పరుగులు చేశాడు.
- అనిల్ కుంబ్లే (337)
- జావగల్ శ్రీనాథ్ (315)
- అజిత్ అగార్కర్ (288)
- జహీర్ ఖాన్ (282)
- హర్భజన్ సింగ్ (269)
- కపిల్ దేవ్ (253)
- రవీంద్ర జడేజా (226)
- మహ్మద్ షమీ (200)
జహీర్ రికార్డును బద్దలు కొట్టిన షమీ
పరిమిత ఓవర్లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ విషయంలో అతను 44 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసిన జహీర్ ఖాన్‌ను వెనక్కి నెట్టాడు. అయితే ఇప్పుడు షమీ 33 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు పడగొట్టి పెద్ద అచీవ్‌మెంట్‌ను తన పేరిట నమోదు చేసుకున్నాడు. దీంతోపాటు వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా మహమ్మద్ షమీ నిలిచాడు.