Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) 2025 వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే దానిపై రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ANI నివేదిక ప్రకారం.. BCCI పాకిస్థాన్‌కు టీమిండియాను పంపేందుకు సముఖంగా లేదు. భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లను యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనుంది. అంతకుముందు గతేడాది పాకిస్థాన్‌లో జరిగిన ఆసియా కప్ సిరీస్‌లో కూడా భారత జట్టు పాకిస్థాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు భారత్ ఆడిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరిగాయి.
ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది..?
వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు షెడ్యూల్ క్యాలెండర్‌ను ఐసీసీకి సమర్పించింది. ICC ఇప్పుడు తన సొంత షెడ్యూల్‌ను ప్రకటించనుంది. తన షెడ్యూల్ ప్రకారం.. భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశం అన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్ లాహోర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది.
Also Read: Hasaranga: శ్రీలంకకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హసరంగ..!
ఏయే జట్లు పాల్గొంటాయి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.
బీసీసీఐ అధికారి వెల్లడించారు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ పాకిస్థాన్ వెళ్లబోదని బీసీసీఐ అధికారి ఒకరు వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరనుందని ఆయన పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కామెంట్స్
భారత ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గతంలో ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అది బీసీసీఐ చేస్తుందన్నారు.