Site icon HashtagU Telugu

IND vs PAK: నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. ఎక్కడ చూడాలంటే?

India vs Pakistan

India vs Pakistan

IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (IND vs PAK) తలపడనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ బుధవారం బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించి తమ ప్రచారాన్ని ప్రారంభించింది. మరోవైపు ఈ వారం ప్రారంభంలో కరాచీలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ న్యూజిలాండ్‌తో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గ్రూప్ A నుండి సెమీ-ఫైనల్ రేసులో కొనసాగడానికి డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌కు భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుంది.

2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ విజయం

2023 వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాల బృందం పాకిస్థాన్‌ను కుదిపేసింది. విజిటింగ్ టీమ్ కేవలం 191 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్‌ జోడీ కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కూడా నాలుగు వికెట్లు తీశారు.

Also Read: Australia Vs England: ఇదేం ఆట‌.. 351 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన ఆసీస్‌!

ప్రత్యక్ష ప్రసార వివరాలు

ఈరోజు భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం కావడంతో కోట్లాది మంది ఈ మ్యాచ్ చూడనున్నారు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ఈ మ్యాచ్ వీక్షించవచ్చు. జియో హాట్‌స్టార్ యాప్‌లోనూ చూడొచ్చు. దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

ఇండియా vs పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.

భారత్ vs పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్ vs పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇండియా vs పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఏ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది?

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ JioHotstarలో చూడ‌వ‌చ్చు.

Exit mobile version