Champions Trophy 2025: టీమిండియా కోసం రంగంలోకి దిగిన ఐసీసీ..!

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి (Champions Trophy 2025) పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది.

Published By: HashtagU Telugu Desk
India vs New Zealand

India vs New Zealand

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి (Champions Trophy 2025) పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఈ టోర్నీ ఆడేందుకు భారత్ పాకిస్థాన్ వెళ్తుందా లేదా అన్నది బీసీసీఐ ఇంకా ధృవీకరించలేదు. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. మరోవైపు భారత్‌ మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీ భారీ ప్లాన్‌ వేసింది. నివేదికలను విశ్వసిస్తే.. టీమ్ ఇండియాకు ప్రత్యామ్నాయ వేదికగా UAEని ICC పరిశీలిస్తోంది.

ఐసీసీ ఈ ప్లాన్ చేస్తోంది

టీమ్ ఇండియాను పాకిస్థాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతించే అవకాశం చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితిలో ICC ఇప్పుడు కొన్ని ఎంపికలను పరిశీలిస్తోంది. భారత్ మ్యాచ్‌ల‌ను యూఏఈకి మార్చాలని ఐసీసీ ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ నుండి యుఎఇకి వెళ్లే బృందాల కోసం ప్రత్యేక చార్టర్డ్ విమానాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. సెమీ-ఫైనల్స్, ఫైనల్‌లలో ఒకటి పాకిస్తాన్ వెలుపలికి మార్చే అవ‌కాశం ఉంది.

Also Read: Carlos Alcaraz: వింబుల్డన్ రారాజు అల్క”రాజ్”.. జకోవిచ్ కు మళ్ళీ నిరాశే..!

ఐసీసీ ఈవెంట్‌కు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది

UAE గతంలో ICC T20 ప్రపంచ కప్ 2021, ఆసియా కప్ 2022కి ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. భారతదేశం- పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా రాజకీయ వాతావ‌ర‌ణం ఆందోళ‌నక‌రంగా ఉంది. దీని కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జ‌ట్ల మధ్య పోటీ జరుగుతుంది. ఇదే పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీని స్వయంగా నిర్వహించాలని పీసీబీ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఈవెంట్‌కు ఎనిమిది జట్లు అర్హత సాధించాయి

ఛాంపియన్స్ ట్రోఫీకి ఎనిమిది జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య పాకిస్థాన్‌తో పాటు భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఇందులో పాల్గొంటాయి. ఇందుకోసం గడ్డాఫీ స్టేడియం లాహోర్, రావల్పిండి, నేషనల్ స్టేడియం కరాచీలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య నిర్వహించవచ్చని స‌మాచారం. ఫిబ్రవరి 19న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఇది ప్రారంభమవుతుంద‌ని తెలుస్తోంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనున్న‌ట్లు స‌మాచారం.

  Last Updated: 14 Jul 2024, 11:51 PM IST