Site icon HashtagU Telugu

Chamika Karunaratne: క్యాచ్‌ పట్టబోయాడు.. పళ్లు రాలాయి..!

Chamika Karunaratne

96098030

క్రికెట్ మైదానంలో ఏదైనా సాధ్యమే. చాలా సార్లు ఆటగాళ్ళు అక్కడక్కడ గాయపడతారు. ఇంకొందరు రోహిత్ శర్మ లాగా గాయపడి కుట్లు పడ్డాక మైదానంలోకి దిగి బ్యాటింగ్ ప్రారంభిస్తారు. అదే విధంగా శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ (LPL)లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆటగాడు గాయపడ్డాడు.

లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్‌ పట్టుకునే క్రమంలో లంక క్రికెటర్‌ చమిక కరుణరత్నే(Chamika Karunaratne) మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు. కాండీ ఫాల్కన్స్‌, గాలె గ్లాడియేటర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. గాలె గ్లాడియేటర్స్ జట్టు బ్యాటర్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు కరుణరత్నే(Chamika Karunaratne) పరిగెత్తుకొచ్చాడు. బంతి అతని మూతిపై బలంగా తగలడంతో అతని ముందు పళ్లు ఊడివచ్చాయి. రక్తం కారుతున్నప్పటికీ క్యాచ్‌ను వదలకపోవడం విశేషం.

శ్రీలంక క్రికెటర్‌ కరుణరత్నే క్యాచ్‌ పట్టబోయి మూతిపళ్లు రాలగొట్టుకున్న సంగతి తెలిసిందే. లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గాలే గ్లాడియేటర్స్‌, జఫ్నా కింగ్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కాగా నోటి నుంచి రక్తం కారడంతో ప్రథమ చికిత్స తీసుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్‌ తర్వాత కరుణరత్నేను ఆసుపత్రికి తరలించి సర్జరీ నిర్వహించారు. మూతికి 30 కుట్లు కూడా పడగా, ప్రస్తుతం కరుణరత్నే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కరుణరత్నే తన సోషల్‌మీడియా ఖాతాలో చెప్పుకొచ్చాడు. ”నాలుగు పళ్లు ఉడినా తిరిగి వచ్చాయి.. మూతికి 30 కుట్టు పడ్డాయి.. కానీ నేను ఇప్పటికి నవ్వగలను. త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తా.. సీ యూ సూన్‌” అంటూ రాసుకొచ్చాడు.

ఇటీవల జరిగిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పిఎల్) మ్యాచ్‌లో శ్రీలంక పేసర్ చమిక కరుణరత్నే క్యాచ్‌కి ప్రయత్నించి 4 దంతాలు కోల్పోయాడు. 26 ఏళ్ల అతను ఇన్‌స్టాగ్రామ్‌లోకి తన సెల్ఫీని పంచుకున్నాడు. విచిత్రమైన ప్రమాదంలో అతను నిజంగా 4 దంతాలను కోల్పోయాడని, దాని కారణంగా 30 కుట్లు పడ్డాయాని ధృవీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరుణరత్నే తన సాహసోపేత ప్రయత్నం తర్వాత రక్తమోడుతూ కనిపించాడు. ఈ సంఘటన తర్వాత చమికాకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

Also Read: India vs New Zealand: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో మ్యాచ్..!

ఈ మ్యాచ్‌లో గాలె గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్యాండీ ఫాల్కన్స్ జట్టు 5 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక టెస్టు, 18 ODIలు, 38 T20Iలలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన అతను శనక నేతృత్వంలోని యూనిట్‌కు కీలక ఆటగాడిగా మారాడు.