India Vs Zim: లి వన్డేలో టీమిండియా ఘనవిజయం

జింబాబ్వే టూర్‌ను భారత గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 07:11 PM IST

జింబాబ్వే టూర్‌ను భారత గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టును 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బౌలింగ్‌లో సమిష్టిగా రాణిస్తే… బ్యాటింగ్‌లో ఓపెనర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభం నుంచే జింబాబ్వేను కట్టడి చేసింది.

చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన దీపక్‌ చాహర్ అదరగొట్టాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపాడు. చాహర్‌కు తోడు సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ కూడా రాణించారు. దీంతో జింబాబ్వే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ చకబావ ఆదుకునే ప్రయ.త్నం చేశాడు. చకబావా 35 పరుగులకు ఔటవగా… చివర్లో ఆతిథ్య జట్టు టెయిలెండర్లు ఎవాన్స్ , ఎంగర్వా రాణించారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. చివరికి జింబాబ్వే 189 పరుగులకు ఆలౌటైంది. ఎర్వాన్స్ 33 , ఎంగర్వా 34 రన్స్‌ చేశారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 3, ప్రసిద్ధ కృష్ణ 3, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టారు.

190 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో టీమిండియా తొలి బంతి నుంచే దూకుడుగా ఆడింది. జింబాబ్వే బౌలర్లపై ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్‌ గిల్ పూర్తి ఆధిపత్యం కనబరిచారు. ధాటిగా ఆడిన వీరిద్దరినీ ఆతిథ్య బౌలర్ల ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో భారత్ వికెట్ నష్టపోకుండానే టార్గెట్ ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. శిఖర్ ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 , శుభ్‌మన్‌ గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత్ 30.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.