Site icon HashtagU Telugu

CCL 2025 : నేడే CCL ప్రారంభం

Ccl 2025 1st Match

Ccl 2025 1st Match

సెలబ్రిటి క్రికెట్ లీగ్ (CCL) 2025 ఈ రోజు నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. 11వ సీజన్‌కు సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ , మాలీ వుడ్ , బాలీవుడ్ సినీ తారలు క్రికెట్ మైదానంలో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ మార్చి 2వ తేదీ వరకు కొనసాగనుంది.

ఈ రోజు తొలి రోజు మ్యాచ్‌లలో మద్యాహ్నం 2 గంటలకు చెన్నై రైనోస్ vs బెంగాల్ టైగర్స్ మధ్య తొలి పోరు జరుగనుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు తెలుగు వారియర్స్ vs కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు బెంగళూరు వేదికగా జరుగనున్నాయి. క్రికెట్‌తో పాటు సినిమాటిక్ గ్లామర్ మేళవింపుతో ఈ టోర్నీ అభిమానులకు వినోదాన్ని అందించనుంది. ఈ సీజన్‌లోనూ తెలుగు వారియర్స్ విజేతగా నిలుస్తుందా? లేక మరే ఇతర జట్టు టైటిల్‌ను గెలుచుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. గత సీజన్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచిన జట్లు ఈసారి మరింత స్ట్రాంగ్‌గా ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ టోర్నీలో నటీనటులు తమ క్రికెట్ స్కిల్స్ ప్రదర్శిస్తూ అభిమానులను అలరించనున్నారు.

Delhi Election Results 2025 : హ్యాట్రికా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?

తెలుగు ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలిగించేలా ఈ నెల 14, 15వ తేదీల్లో హైదరాబాద్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. క్రికెట్ ప్రేమికుల కోసం సినీ తారల మ్యాచ్‌లు మరింత ఉత్సాహభరితంగా మారనుండటంతో వీక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కేవలం క్రీడానికే కాకుండా సినీ పరిశ్రమల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు సహాయపడుతోంది. టికెట్లు ఇప్పటికే హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్నాయి. మరి, ఈ సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో చూడాలి!