Site icon HashtagU Telugu

Carlos Alcaraz: వింబుల్డన్ రారాజు అల్క”రాజ్”.. జకోవిచ్ కు మళ్ళీ నిరాశే..!

Carlos Alcaraz

Carlos Alcaraz

Carlos Alcaraz: స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరోసారి అదరగొట్టాడు. వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సెర్బియన్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు మరోసారి షాకిస్తూ విజేతగా నిలిచాడు. టైటిల్ పోరులో అల్కరాజ్ 6-2, 6-2,7-6 స్కోర్ తో విజయం సాధించాడు. టెన్నిస్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ మ్యాచ్ లో ఆద్యంతం అల్కరాజ్ దే పైచేయిగా నిలిచింది. తొలి రెండు సెట్లలోనూ జకోవిచ్ పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు.అల్కరాజ్ ప్లేస్ మెంట్ షాట్లకు సెర్బియన్ స్టార్ సరిగా రిప్లై ఇవ్వలేకపోయాడు. ఫలితంగా రెండు సెట్లను 6-2, 6-2 తో గెలిచాడు. అయితే మూడో సెట్ లో పుంజుకున్న జకోవిచ్ 4-4తో సమం చేసినా… తొమ్మిదో గేమ్ ను కోల్పోవడంతో మ్యాచ్ ముగిసేలా కనిపించింది.

Also Read: MS Dhoni: వీడ్కోలు సమయంలో భావోద్వేగంతో ధోనీని హగ్ చేసుకున్న రాధిక మర్చంట్

అయితే సర్వీస్ తప్పిదాలతో మళ్ళీ జకోవిచ్ కు అవకాశం వచ్చింది. దీంతో పుంజుకున్న జకోవిచ్ సెట్ ను టైబ్రేక్ కు తీసుకెళ్ళాడు. అయితే ఈ సారి టై బ్రేక్ లో జకో తప్పిదాల అల్కరాజ్ కు అడ్వాంటేజ్ గా మారాయి. ఫలితంగా టై బ్రేక్ లో సెట్ తో పాటు మ్యాచ్ నూ ఈ స్పెయిన్ యంగ్ ప్లేయర్ సొంతం చేసుకున్నాడు. దీంతో కెరీర్ లో 25వ గ్రాండ్ శ్లామ్ గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న జకోవిచ్ కు నిరాశే మిగిలింది. కాగా ఈ తరం అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అల్కరాజ్ కెరీర్ లో ఇది నాలుగో గ్రాండ్ శ్లామ్ టైటిల్. అలాగే వరుసగా రెండో వింబుల్డన్ టైటిల్. గత ఏడాది కూడా ఫైనల్లో జకోవిచ్ పైనే అల్కరాజ్ విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచాడు. 21 ఏళ్ళ కార్లోస్ అల్కరాజ్ గ్రాండ్ శ్లామ్ ఫైనల్ చేరిన ప్రతీసారీ టైటిల్ గెలిచాడు. 2022లో యూఎస్ ఓపెన్ , 2023లో వింబుల్డన్ , ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ తో పాటు తాజగా వింబుల్డన్ లోనూ ఛాంపియన్ గా నిలిచాడు.

We’re now on WhatsApp. Click to Join.

Exit mobile version