Hardik Pandya: తొలి రెండు టీ20లో విజయం సాధించిన భారత్, సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. ముఖ్యంగా బ్యాటర్లు విఫలమయ్యారు. 9వ ఓవర్ నుంచి 16వ ఓవర్ వరకు టీమిండియా బ్యాట్స్‌మెన్లు కేవలం 40 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక్కడే టీమిండియా ఓటమికి బీజం పడింది. అయితే హార్దిక్ (Hardik Pandya) క్రీజులో ఉన్నప్పుడు ఓ దశలో భారత్ గెలుస్తుందని అంతా భావించారు. అయితే హార్దిక్ క్యాచ్ అవుట్ తో మ్యాచ్ టర్న్ తీసుకుంది. చివర్లో షమీ సిక్స్ బాది మళ్ళీ ఆశలు రేకిత్తించాడు. కానీ మరుసటి బంతికి షమీ అవుట్ అవ్వడంతో టీమిండియాకు ఓటమి ఖరారైంది.
భారత బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కాపాడుకుంది. అయితే టీమిండియా ఓటమికి హార్దిక్ పాండ్యానే కారణమని కామెంట్స్ చేశాడు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్. కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. హార్దిక్ పాండ్యా ఆరంభంలో చాలా బంతులను వృధా చేస్తున్నట్లు పటేల్ చెప్పాడు. ఇది జట్టుపై ఒత్తిడిని పెంచడంతో పాటు నెట్ రన్ రేట్‌ను కూడా పెంచిందని అన్నాడు. కాగా హార్దిక్ 35 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. అయితే హార్దిక్ చివరివరకు క్రీజులో ఉంటే టీమిండియాకు విజయం దక్కి ఉండేది.
Also Read: Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. ధరలు పెరిగినట్లు ప్రకటించిన మంత్రి తుమ్మల
భారత బ్యాటింగ్ ఆర్డర్ పట్ల ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గంభీర్ ధ్రువ్ జురెల్ విషయంలో మిస్టేక్ చేసినట్లు అభిప్రాయపడ్డాడు. ధ్రువ్ జురెల్‌ను 8వ నంబర్‌కు బదులుగా కాస్త ముందుగా బ్యాటింగ్ పంపి ఉండాల్సిందని, అప్పుడు చివర్లో రన్ రేట్ చాలా తక్కువగా ఉండేదని పేర్కొన్నాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులతో ఇన్నింగ్స్ ముగించేసింది.