Site icon HashtagU Telugu

Canada Open 2023 Finals: కెనడా ఓపెన్ విజేత లక్ష్య సేన్

Canada Open 2023 Finals

New Web Story Copy 2023 07 10t095518.091

Canada Open 2023 Finals: భారత యువ షట్లర్ లక్ష్య సేన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో లక్ష్య సేన్ 21-18, 22-20 స్కోర్ తో చైనా ప్లేయర్ , ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ లి షి ఫెంగ్ పై విజయం సాధించాడు. ఈ టోర్నీ ఆరంభం నుంచీ అదరగొడుతున్న భారత్ యువ కెరటం టైటిల్ పోరులో కూడా చెలరేగి పోయాడు. వరల్డ్ రాంకింగ్స్ లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న చైనా ప్లేయర్ పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. రెండో గేమ్ లో ప్రత్యర్ధి కాస్త పోటీ ఇచ్చిన కీలక సమయంలో ఆధిక్యం నిలుపుకుని టైటిల్ గెలుచుకున్నాడు. లక్ష్య సేన్ కెరీర్ లో ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ టైటిల్. ఇంతకు ముందు 2022 లో ఈ యువ ప్లేయర్ ఇండియా ఓపెన్ గెలిచాడు. ఈ టోర్నమెంట్ లో లక్ష్య సేన్ పలు సంచలనాలు నమోదు చేశాడు. రౌండ్ 32 లో వరల్డ్ 4వ ర్యాంకర్ పైనా , సెమీస్ లో 10వ ర్యాంకర్ పైనా విజయాలు సాధించాడు.

ఇదిలా ఉంటే కెనడా ఓపెన్ లో అంచనాలు పెట్టుకున్న తెలుగు తేజం పీవీ సింధు నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో సింధు ప్రపంచ నంబర్ వన్ అకానె యమగుచి చేతిలో ఓటమిని చవిచూసింది. సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లో ఓడిన తర్వాత యమగూచిపై భారత షట్లర్ సింధుకి ఇది వరుసగా రెండో ఓటమి. ప్రస్తుతం మంచి ఫామ్‌లో లేని సింధు.. పేలవమైన ఫామ్‌ నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతోంది. గాయం కారణంగా విరామం తీసుకున్న ఆమె ఏ టైటిల్‌ను గెలుచుకోలేదు. కాగా కెనడా ఓపెన్ లో మిగిలిన భారత ప్లేయర్స్ కూడా నిరాశ పరిచారు. అయితే పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన లక్ష్య సేన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Read More: Fire Accident: బాలానగర్ లోని ఓ అపార్టుమెంట్లో భారీ అగ్నిప్రమాదం