Site icon HashtagU Telugu

Sunrisers Play Off: సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరుతుందా ?

Srh Imresizer

Srh Imresizer

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి తర్వాత హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు ప్రభావితమయ్యాయి. హైదరాబాద్ టీమ్‌కి ఇది ఐదో ఓటమి. లీగ్ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో పట్టికలో 6వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్.. మిగిలిన 4 మ్యాచ్‌ల్లో గెలిస్తే పాయింట్ల సంఖ్య 18కి చేరుతుంది.

దాంతోఈసారి ఐపీఎల్‌లో సునాయాసంగా ప్లేఆఫ్స్‌కి చేరొచ్చు… ఒకవేళ 3 మ్యాచ్‌ల్లోనే గెలుపొందినా కూడా ప్లేఆఫ్ చేరడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కు అవకాశముంటుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌లాడిన గుజరాత్ టైటాన్స్ జట్టు 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి.. ప్లేఆఫ్స్ రేసులో ముందుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ 14 పాయింట్లు, రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో టాప్-4లో కొనసాగుతున్నాయి. ఈ నాలుగు జట్లతో పాటుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో , పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో , ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో, కేకేఆర్ 8 పాయింట్లతో కూడా ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతున్నాయి. వీటిలో కేకేఆర్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు దాదాపు ప్లేఆఫ్ పోటీ నుంచి తప్పుకుంటుంది. అలాగే పంజాబ్ కింగ్స్ కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నా నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది.

కాబట్టి ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడినా దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగినట్లే అని చెప్పొచ్చు. అయితే ప్లే ఆఫ్ రేసులో తొలి మూడు స్థానాలను గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ దక్కించుకోగగా.. మిగిలిన నాలుగో బెర్తు కోసం సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లన్నిటిని వెనక్కినెట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ లోకి చేరాలంటే మాత్రం మెరుగైన నెట్ రన్ రేట్ తో మిగిలిన మ్యాచులను గెలవాల్సి ఉంటుంది.