Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్‌లో రెండు గ్రూపులు.. ముదురుతున్న వివాదం..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 08:55 AM IST

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం ద్వారా ఫ్రాంచైజీ కొత్త వివాదం సృష్టించినట్లు కనిపిస్తోంది. రోహిత్‌ని తొలగించి హార్దిక్‌కి కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచి భిన్నమైన వార్తలు వస్తున్నాయి. ఇటీవల రోహిత్ భార్య రితికా సజ్దేహ్ ​​సోషల్ మీడియాలో మార్క్ బౌచర్ వీడియోపై వ్యాఖ్యానించిన తీరు, మరుసటి రోజు పోస్ట్‌లో హిట్‌మ్యాన్ అతని భార్యను ప్రశంసించిన విధానంతో ముంబై ఇండియ‌న్స్‌తో రోహిత్‌కు స‌ముచిత స్థానం లేద‌ని తెలుస్తోంది . అయితే తాజ‌గా ముంబై ఇండియన్స్ రెండు గ్రూపులుగా విడిపోయింది అనే ఊహాగానాలు సోష‌ల్ మీడియాలో మొద‌ల‌య్యాయి.

రెండు గ్రూపులు ఏవి..?

రెండు గ్రూపుల గురించి మాట్లాడితే.. ఈ రెండు గ్రూపులు హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గ్రూపులుగా విడిపోయార‌ని తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య వివాదం ఉందని, సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అనుసరించరని తేలింది. ఇప్పుడు టీమ్‌లో రెండు వర్గాలు చీలిపోయాయని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, మిగిలిన‌ ఆటగాళ్ల బృందం ఉంది.

రెండో గ్రూపులో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ నుండి కెప్టెన్సీని లాగేసుకున్నప్పటి నుండి ముంబై ఇండియ‌న్స్‌లో వివాదం న‌డుస్తోంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గించి పాండ్యాను కెప్టెన్‌గా ప్ర‌కటించిన త‌ర్వాత‌ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా తమ స్పందనలను సోషల్ మీడియాలో బహిరంగంగా వ్యక్తం చేశారు.

Also Read: KL Rahul Ruled Out: మూడో టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్ దూరం..!

దీని తర్వాత ఇషాన్ కిషన్ టీమిండియాపై దృష్టి పెట్టకుండా IPL మోడ్‌లోకి వచ్చి బరోడాలో హార్దిక్ పాండ్యాతో విడిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయాలన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో ముంబై ఇండియన్స్ నుండి కీల‌క ఆట‌గాళ్లు నిష్క్రమించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు పెద్ద ఆటగాళ్లను ట్రేడింగ్ చేసేందుకు ముంబైని సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్త‌ల‌పై ఇంకా స్పష్టత లేదు. కానీ నిబంధనల ప్రకారం ఇది జరగవచ్చని తెలుస్తోంది.

We’re now on WhatsApp : Click to Join

ట్రేడింగ్ నియమాల గురించి మాట్లాడినట్లయితే ఈ విండో సీజన్ ముగిసిన వెంటనే తెరవబడుతుంది. ఐపిఎల్ వేలం షెడ్యూల్ తేదీకి వారం ముందు వరకు ఈ విండో తెరవబడుతుంది. ఆ తర్వాత వేలం ముగిసిన వెంటనే ఈ విండో మళ్లీ తెరుచుకుంటుంది. ఇది సీజన్ ప్రారంభానికి ఒక నెల ముందు వరకు తెరిచి ఉంటుంది. IPL కొత్త సీజన్ మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. ట్రేడింగ్ విండో ఫిబ్రవరి 21-22 వరకు తెరిచి ఉంటుంది. ఆ కోణంలో ట్రేడింగ్ ఇప్పటికీ సాధ్యమే. మరి 10 రోజుల్లో ఈ వివాదం పెద్ద మలుపు తిరుగుతుందా లేదా అనేది చూడాలి.

 

Follow us