Site icon HashtagU Telugu

Jaspirt Bumrah: క్యాచ్‌లు వదిలించడంపై బుమ్రా స్పందన: “నిరాశగా ఉన్నా, డ్రామా చేయను”

Jasprit Bumrah

Jasprit Bumrah

లీడ్స్, ఇంగ్లాండ్: (Jasprit Bumrah) ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఫీల్డింగ్ విభాగంలో తీవ్రంగా విఫలమైంది. మొత్తం 6 క్యాచ్‌లు వదిలేయడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. ఇందులో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ సమయంలో 3 కీలక క్యాచ్‌లు పడిపోవడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసే అవకాశం పొందింది. ఫలితంగా భారత్‌కి తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే దక్కింది.

దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా స్పందించారు. “క్యాచ్‌లు వదిలితే ఒక క్షణం ఎవరైనా నిరాశకు లోనవుతారు. కానీ నేను దాన్ని tamasha చేయదలచుకోలేదు. ఆటగాళ్లు కొత్తవాళ్లే అయినా, వారు శ్రమిస్తున్నారు. ఎవరు కావాలని ఇలా చేయరు,” అని చెప్పారు.

ఇది ఆటలో భాగమేనని, ఇలాంటి అనుభవాలే ఆటగాళ్లను ఎదుగుదల వైపు నడిపిస్తాయని బుమ్రా అభిప్రాయపడ్డారు. “క్యాచ్‌లు పడకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ గతం మీద కాకుండా ముందున్న ఆటపై దృష్టి పెట్టాలి,” అని చెప్పారు.

తన బౌలింగ్ యాక్షన్, ఫిట్నెస్‌పై తరచూ వస్తున్న విమర్శలపై బుమ్రా గట్టిగానే స్పందించారు. “చాలామంది నా కెరీర్ ఆరంభంలోనే చెప్పారు – ఈయన ఎనిమిది నెలలే ఆడతాడు. కాని ఇప్పుడు నాకు 10 ఏళ్ల ఇంటర్నేషనల్ క్రికెట్, 12-13 ఏళ్ల ఐపీఎల్ అనుభవం ఉంది. ప్రతి నాలుగు నెలలకోసారి నా కెరీర్ ముగిసినట్టు రూమర్లు వస్తుంటాయి. కానీ నేను నా పని చేస్తూనే ఉంటాను,” అని వ్యాఖ్యానించారు.

బుమ్రా చెప్పినట్లు – “ప్రజలు ఏమి రాస్తారు అన్నది నా నియంత్రణలో ఉండదు. వారికి పాఠకులు వస్తే బాగుంది, నాకు అది పెద్ద విషయం కాదు.” ప్రస్తుతం పిచ్ గురించి మాట్లాడుతూ బుమ్రా – “ఇప్పుడు పిచ్ బ్యాటింగ్‌కి బాగానే ఉంది. కానీ వేగం కొద్దిగా డబుల్ పేస్‌గా మారుతోంది. టెస్ట్ క్రికెట్‌లో ఇది సహజం. మేము ఎక్కువ స్కోర్ చేసి వారికి కఠినమైన లక్ష్యం ఇవ్వాలని చూస్తున్నాం,” అని అన్నారు.

బుమ్రా ఇలా సమతులితంగా స్పందించడం ద్వారా విమర్శకుల‌కు తగిన సమాధానమే కాకుండా, టీమ్‌లో శాంతమైన వాతావరణం కొనసాగించడానికి కృషి చేసినట్టు కనిపిస్తోంది.