Site icon HashtagU Telugu

Asia Cup 2023: జట్టులోకి స్టార్ ప్లేయర్స్.. టీమిండియాలో పూర్వ వైభవం?

Asia Cup 2023

New Web Story Copy (81)

Asia Cup 2023: కొంతకాలంగా టీమిండియా జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. కీలక మ్యాచ్ లలో కొందరు స్టార్ ప్లేయర్స్ జట్టుకు ఆడలేకపోయారు. టీమిండియా డేంజరస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యాడు. ఆ లోటు ముంబై ఇండియన్స్ జట్టులో క్లియర్ గా కనిపించింది. నిజానికి జస్ప్రీత్ బుమ్రా ఉంటే ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంతో ప్రముఖ పాత్ర పోషించేది. ఇక మరో స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. గాయాల కారణంగా ఈ స్టార్స్ ఐపీఎల్ మరియు WTC ఫైనల్‌లో ఆడలేకపోయారు. ఇదిలా ఉండగా ఈ స్టార్ ఆటగాళ్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే జట్టులో భాగస్వామ్యం కానున్నారు.

జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం ఎన్సిఏ(NCA) లో ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్సిఏ తీపి కబురు అందించింది. సెప్టెంబరులో జరిగే ఆసియా కప్‌కు ముందు ఇద్దరు ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉండవచ్చని NCA వైద్య సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా వెన్ను గాయంతో మార్చిలో న్యూజిలాండ్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గతేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ తర్వాత అతను టీమ్ ఇండియా తరఫున ఏ మ్యాచ్ ఆడలేదు. బుమ్రా ప్రధానంగా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు.

మార్చిలో అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో లోయర్ బ్యాక్‌లో డిస్క్ సమస్య కారణంగా శ్రేయాస్ జట్టుకు దూరమయ్యాడు. మే నెలలో లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ ఆటగాడు ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. మరోవైపు గత ఏడాది రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురికావడంతో జట్టుకు దూరమయ్యాడు. పంత్‌ కూడా త్వరలో జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు పంత్ ను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది.

Read More: Cricketer KS Bharat: సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన టీమిండియా క్రికెట‌ర్ కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్.. సీఎంకు జెర్సీ బ‌హుక‌ర‌ణ‌