Site icon HashtagU Telugu

Bumrah: రోహిత్ స్థానంలో కెప్టెన్సీ అతనికేనా ?

Boomrah

Boomrah

ఇంగ్లాండ్ టూర్ లో జరగనున్న ఏకైక టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్న వేళ రోహిత్ శర్మ కరోనా బారిన పడడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే. ప్రస్తుతం రోహిత్ శర్మ ఐసోలేషన్ లో ఉన్నాడు. దాంతో జూలై 1న ఇంగ్లండ్ తో ఆరంభమయ్యే రీషెడ్యూల్ మ్యాచ్ నాటికి అతడు కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. రోహిత్ కోలుకోకుంటే అతని స్థానంలో జట్టు పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ టూర్ లో బూమ్రా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దీంతో రోహిత్ శర్మ స్థానంలో
కొత్త కెప్టెన్‌గా జ‌స్ప్రీత్ బుమ్రాను ఎంపిక‌చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అత‌డికే సార‌థ్య బాధ్య‌త‌ల్ని అప్ప‌గించాల‌ని కోచ్ ద్రావిడ్ తో పాటు టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. అదే నిజ‌మైతే 35 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించనున్న ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా రికార్డును సృష్టించనున్నాడు. గతంలో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్లలో కపిల్ దేవ్ ఒక్కడే టెస్ట్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతడి తర్వాత ఈ ఘనతను సాధించిన ప్లేయర్ గా బూమ్రా నిలవబోతున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాత్కాలిక కెప్టెన్ గా రేసులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఫామ్ లేమి కార‌ణంగా కొంత‌కాలంగా కోహ్లి బ్యాటింగ్‌లో స‌రిగా రాణించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కెప్టెన్ భారాన్ని మోపి అత‌డిని మ‌రింత ఒత్తిడికి గురిచేయ‌డం స‌రికాదంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఇంగ్లాండ్ లాంటి టీమ్ పై పంత్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడా అనే డౌట్స్ కూడా వచ్చాయి. ఈ నేపద్యంలో బూమ్రా వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ ఎడ్జ్ బాస్టన్ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు.

Exit mobile version