Pele: వెంటిలేటర్ పై పీలే

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గ‌జం పీలే ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్నట్టు తెలుస్తోంది. కీమో థెర‌ఫీకి ఆయన స్పందించ‌డం లేద‌ని స‌మాచారం.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 11:42 PM IST

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గ‌జం పీలే ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్నట్టు తెలుస్తోంది. కీమో థెర‌ఫీకి ఆయన స్పందించ‌డం లేద‌ని స‌మాచారం. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పీలే గత ఏడాది పేగు క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు.

అత‌డి పెద్ద పేగు నుంచి క‌ణితిని డాక్ట‌ర్లు తొల‌గించారు. క్యాన్స‌ర్ కార‌ణంగా ఇటీవ‌లే పీలే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పీలే హెల్డ్ కండీష‌న్ బాగానే ఉంద‌ని రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే శ‌నివారం పీలే ఆరోగ్యం క్షీణించిన‌ట్లు బ్రెజిల్ ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం పీలే కీమో థెర‌ఫీకి స్పందించ‌డం లేద‌ని వైద్యులు చెబుతున్నారు. పీలేను పాలియోటివ్ కేర్ యూనిట్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. ప్రాణాంత‌క వ్యాధుల కార‌ణంగా మ‌ర‌ణ‌పు ముంగిట ఉన్న‌వారిని పాలియోటివ్ కేర్ యూనిట్‌కు త‌ర‌లిస్తుంటారు.

ఫుట్ బాల్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్ లో ఒకరైన పీలే తన కెరీర్‌లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్‌ చేశారు. తద్వారా అత్య‌ధిక‌గోల్స్ చేసిన ప్లేయ‌ర్‌గా గిన్నిస్‌ రికార్డు సాధించారు. బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్‌ చేశారు.