Bravo: ఐపీఎల్ కు గుడ్ బై… కొత్త రోల్ లో బ్రావో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న విండీస్ ఆటగాడు డ్వయాన్ బ్రావో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 05:30 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న విండీస్ ఆటగాడు డ్వయాన్ బ్రావో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు. రానున్న సీజన్ లో బ్రావో కొత్త రోల్ లో కనిపించబోతున్నాడు. అతను రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది సేపటికే బౌలింగ్ కోచ్ గా నియమిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణయం తీసుకుంది. దీంతో బౌలింగ్ కోచ్ గా రాబోతుండడం సంతోషంగా ఉందంటూ బ్రావో ట్వీట్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రావోను ఇటీవలే మినీ వేలంలోకి ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. ఈ నేపథ్యంలోనే విండీస్ ఆల్ రౌండర్ లీగ్ కు గుడ్ బై చెప్పాడు.
సూపర్‌కింగ్స్‌ కుటుంబంలో దశాబ్దకాలంగా కీలక సభ్యుడిగా ఉన్న బ్రావోతో తమ అనుబంధం కొనసాగుతుందని.. అతడిని బౌలింగ్‌ కోచ్‌గా నియమించినట్లు సీఎస్ కే వెల్లడించింది.
ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్టు పడగొట్టిన ఆటగాడిగా డ్వయాన్ బ్రావో రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో 161 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ 183 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటర్ గా 1560 పరుగులు సాధించాడు. 2011లో సీఎస్‌కేకు తొలిసారి ఆడిన బ్రావో 2011, 2018, 2021లో జట్టును చాంపియన్‌గా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. 2014 నాటి చాంపియన్స్‌ లీగ్‌ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 2013, 2015లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రెండుసార్లు పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.