Site icon HashtagU Telugu

Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదేనా!

Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

Boxing Day Test: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తడబడుతుంది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (Boxing Day Test) భాగంగా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. భారీ అంచనాలతో దిగిన ఆ ఇన్నింగ్స్ లో భారత్ 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. అయితే బ్యాటర్లు తడబడ్డ పిచ్ పై బౌలర్లు విధ్వంసం సృష్టించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాదే పైచేయి కనిపించింది.

రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టించారు. దీంతో భారత్ 500 మార్కును అందుకుంది. ఫలితంగా తొలి టెస్టులో భారత్ అద్భుత విజయం అందుకుంది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా సమిష్టిగా రాణించి టీమిండియాను దారుణంగా ఓడించింది. మిచెల్ స్టార్క్ దెబ్బకు టీమిండియా బ్యాటింగ్ దళం పూర్తిగా నేలకూలింది. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న జైస్వాల్ తుస్సుమనిపించాడు. స్టార్క్ జైస్వాల్ ని పగబట్టినట్టే రెండు ఇన్నింగ్సల్లోనూ అవుట్ చేశాడు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా సిరీస్ 1-1తో సమమైంది. అయితే మూడో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాలుగో టెస్టులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ కీలక టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ టెస్ట్ రోహిత్ కు అత్యంత కీలకంగా మారింది. వరుసగా విఫలమవుతున్న రోహిత్ నాలుగో టెస్టులైనా రాణిస్తాడేమో చూడాలి.దీంతో అందరి దృష్టి చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో డిసెంబర్ 26 నుండి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌పై పడింది.

Also Read: ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌, భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..!

నాలుగో టెస్టు తుది జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. శుభమాన్ గిల్ ని జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది. ఈ టోర్నీలో గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరోవైపు ఆరో స్థానములో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ గిల్ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. జట్టు మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్ ఖాన్‌ని తుది జట్టులోకి తీసుకోబుతున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే సర్పరాజ్ నంబర్-6లో బ్యాటింగ్ కు దిగవచ్చు. జడేజాను కూడా బెంచ్ పై కుర్చోపెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జడ్డు బౌలింగ్ లో రాణించలేకపోయాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా స్థానంలో సుందర్‌ని జట్టులోకి తీసుకోవచ్చు.ఆకాష్‌దీప్ గత మ్యాచ్ లో తన బ్యాటింగ్‌తో ఫాలో ఆన్‌ను కాపాడడంలో భారత్‌కు సహకరించాడు. సో ఆకాష్ ని కొనసాగించే అవకాశం ఉంది. అయితే సిరాజ్‌ని డ్రాప్ చేసి రానా లేదా ప్రసిద్ధ్ కృష్ణను తుది జట్టులోకి తీసుకోవచ్చు.