Rana At Boxing Bay: రానా దగ్గుబాటి (Rana Daggubati) స్థాపించిన, స్పిరిట్ మీడియా నిర్మించిన బాక్సింగ్‌బే, డిసెంబర్ 2024 తర్వాత నిర్వహించే రెండు ప్రధాన బాక్సింగ్ ఈవెంట్‌లను నిర్వహిస్తున్న ఏపీఎఫ్సీ స్థాపకుడు ఆంటోనీ పెట్టిస్‌తో (Antony Petties) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒకటి యునైటెడ్ స్టేట్స్‌లో, మరొకటి భారతదేశంలో (India) జరుగుతుంది. ఈ రోజు అగావేలో రానా దగ్గుబాటి సంస్థ, ఆంథోనీ పెట్టిస్ ప్రమోట్ చేసిన బాక్సింగ్ క్లబ్ (Boxing Club) మధ్య ఒప్పందం జరిగింది.
ఈ కార్యక్రమంలో వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (Boxing Council) నుండి ఆస్కార్ (Oscar) వల్లే, మిస్టర్స్ ఎరికా కాంట్రెరాస్ అపార్ట్‌మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా (WorldWide) ఉన్న అభిమానులకు ఉత్సాహకరమైన బాక్సింగ్ యాక్షన్‌ను అందించనుంది. బాక్సింగ్‌బే మాజీ యుఎఫ్‌సి ఛాంపియన్ ఆంటోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్ మధ్య 5 వర్సెస్ 5 థ్రిల్లింగ్ బాక్సింగ్ షో డౌన్‌ను కలిగి ఉంటుంది.
అత్యంత ప్రసిద్ధ యూఎఫ్‌సీ ఫైటర్లలో (FIghters) ఒకరు, ఏపీఎఫ్సీ స్థాపకుడు అయిన ఆంటోనీ పెట్టిస్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. బాక్సింగ్‌బేతో (BoxingBay) ఈ భాగస్వామ్యం మా ఫైటర్లు అభిమానులకు (Fans) కొత్త అవకాశాలు కల్పిస్తుంది. ఈ క్రీడ పరిధిని విస్తరించడం సాధ్యమవుతుంది. యూఎస్ బాక్సింగ్‌ను (Us Boxing) ఇండియాకు తీసుకువస్తున్నందుకు సంతోషంగా (Happy) ఉందన్నారు. ఇండియన్ ఫైటర్లను గ్లోబల్ స్టేజీపైకి (Global Stage) తీసుకువస్తామని ఆయన అన్నారు.
అనంతరం రానా దగ్గుబాటి (Rana) మాట్లాడుతూ.. బాక్సింగ్‌బే భారతదేశంలో బాక్సింగ్ (Boxing) క్రీడను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. ఏపీఎఫ్సీతో (IPFC) ఈ భాగస్వామ్యం భారత బాక్సింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ” అని రానా అన్నారు.