WI vs IND: కరేబియన్ గడ్డపై సత్తా చాటిన బౌలర్లు

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న గురువారం టీమిండియా విండీస్ తో మొదటి వన్డే మ్యాచ్ ఆడింది. మొదటి బ్యాటింగ్ బరిలోకి దిగిన కరేబియన్లు టీమిండియా బౌలర్ల ఎటాకింగ్ కి నిలువలేకపోయారు.

WI vs IND: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న గురువారం టీమిండియా విండీస్ తో మొదటి వన్డే మ్యాచ్ ఆడింది. మొదటి బ్యాటింగ్ బరిలోకి దిగిన కరేబియన్లు టీమిండియా బౌలర్ల ఎటాకింగ్ కి నిలువలేకపోయారు. ఆ జట్టు కెప్టెన్ హోప్ మినహా ఎవరూ ప్రభావం చూపించలేదు. హోప్ 45 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ సమయంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హోప్ ని కట్టడి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కుల్దీప్ మొదటి వన్డేలో 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 మెయిడిన్ ఓవర్లు వేయడం మెచ్చుకోదగ్గ విషయం. కుల్దీప్ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు నేలకూల్చాడు.

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తొలి వన్డేలో సత్తా చాటాడు. 3 వికెట్లు పడగొట్టి కరేబియన్లను కట్టడి చేశాడు. 6 ఓవర్లు వేసిన జడ్డు కేవలం 37 పరుగులు సమర్పించాడు. మొత్తానికి మొదటి వన్డేలో కుల్దీప్, జడేజా కలిసి కరేబియన్లను కట్టడి చేయడంతో ఆతిథ్య జట్టు 114 పరుగులకే కుప్పకూలింది.

Also Read: GHMC ఆఫీస్ దగ్గర టెన్షన్..టెన్షన్