Boundary Count: ప్రపంచకప్ 2023 అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు చివరిసారి ఫైనల్‌లో తలపడ్డాయి. ఇంగ్లండ్ టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి పోటీ ఉంటుంది. భారతదేశంలోని 10 నగరాల్లో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో 10 జట్లకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొంటారు. క్రికెట్ వరల్డ్ కప్ ను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు వస్తుంటారు. ప్రపంచకప్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..!
మ్యాచ్‌లు ఎక్కడెక్కడ జరగనున్నాయి..?
ప్రపంచకప్ 2023 తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీంతో పాటు 10 గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం, ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, చెన్నైలోని MA చిదంబరం స్టేడియం, లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ఎం. చిన్నస్వామి స్టేడియం, ముంబై వాంఖడే స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ లు జరగనున్నాయి.
10 జట్ల నుండి 150 మంది ఆటగాళ్ళు పాల్గొంటారు
ప్రపంచకప్‌లో ప్రతి జట్టు గరిష్టంగా 15 మంది ఆటగాళ్లను కలిగి ఉండేందుకు ICC అనుమతించింది. ఈసారి ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. సెమీ ఫైనల్‌కు ముందు నవంబర్ 12న భారత్, నెదర్లాండ్స్ మధ్య చివరి మ్యాచ్ జరగనుంది.
బౌండరీ కౌంట్ రూల్
ప్రపంచకప్ 2019 ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ టై అయింది. ఈ కారణంగా సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే సూపర్ ఓవర్ కూడా టై అయింది. తర్వాత బౌండరీ కౌంట్ (Boundary Count) నియమం ప్రకారం ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. అయితే, ఐసీసీ ఇప్పుడు బౌండరీ కౌంట్ నిబంధనను రద్దు చేసింది.
2019 ప్రపంచకప్ తరువాత ఈ నిబంధన చర్చకొచ్చింది. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపారు. ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఉంటుంది. సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీ కౌంట్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇక ఈ నిబంధన ప్రపంచకప్‌లో కన్పించదు. మ్యాచ్ డిసైడ్ అయ్యేంతవరకూ సూపర్ ఓవర్లు ఆడాల్సిందే.
Also Read: Beer Company: బీర్ కంపెనీతో రూ. 66 కోట్ల డీల్ చేసుకున్న ఐసీసీ..!
We’re now on WhatsApp. Click to Join.
ప్రపంచ కప్ 2023 ఫైనల్, సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి?
ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి సెమీఫైనల్ జరగనుంది. ఆ తర్వాత రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది..?
అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో పోటీ ఉంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 11న ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.