Bitter experience for Dhoni fan : ఉప్ప‌ల్‌లో ధోని ఫ్యాన్‌కు చేదు అనుభవం.. నా సీటెక్క‌డ ? డ‌బ్బులిచ్చేయండి

వేల రూపాయ‌లు పెట్టి టికెట్ కొన్న ఓ చెన్నై ఫ్యాన్ కు మాత్రం చేదు అనుభ‌వం ఎదురైంది.

  • Written By:
  • Updated On - April 6, 2024 / 08:58 PM IST

Bitter experience for Dhoni fan : మిగిలిన దేశాల‌తో పోలిస్తే మ‌న దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరే. ఇక ఐపీఎల్ (IPL) వ‌చ్చిదంటే చాలు అన్ని ప‌నులు మానుకుని టీవీ ముందు కూర్చోనే వాళ్లు ఎంద‌రో. టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్‌ మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ఇదే ఆఖ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో మైదానంలో ధోనిని ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోతున్న అభిమానులు చాలా మందే ఉన్నారు. ఈక్ర‌మంలో సీఎస్‌కే (CSK) ఎక్క‌డ మ్యాచ్ ఆడినా కూడా అక్క‌డి స్టేడియాలు జ‌న‌సంద్రాన్ని త‌ల‌పిస్తున్నాయి.

శుక్ర‌వారం చెన్నై జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. మ్యాచ్ జ‌రిగింది ఉప్ప‌ల్ మైదానంలో అయినా స‌రే.. గ్రౌండ్‌లో ఎల్లో జెర్సీ ధ‌రించిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. అందుకు కార‌ణం ఎంఎస్ ధోని అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

చెన్నై ఫ్యాన్‌కు చేదు అనుభ‌వం..

కాగా.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల కోసం ప్ర‌య‌త్నించిన కొంత మందికి నిరాశ త‌ప్ప‌లేదు. టికెట్ ద‌క్కించుకున్న వాళ్లు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. వేల రూపాయ‌లు పెట్టి టికెట్ కొన్న ఓ చెన్నై ఫ్యాన్ కు మాత్రం చేదు అనుభ‌వం ఎదురైంది. మ్యాచ్ మొత్తం అత‌డు నిల‌బ‌డి చూడాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఆగ్ర‌హించిన అత‌డు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని వివ‌రించాడు.

జునైద్ అహ్మ‌ద్ అనే వ్య‌క్తి రూ.4500 పెట్టి స‌న్‌రైజ‌ర్స్ వ‌ర్సెస్ చెన్నై మ్యాచ్ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అత‌డికి సీటు నంబ‌ర్ J-66 అలాట్ చేసిన‌ట్లుగా ఉంది. మ్యాచ్ చూసేందుకు శుక్ర‌వారం సాయంత్రం ఐదు గంట‌ల క‌ల్లా మైదానానికి చేరుకున్నాడు. ఆ నంబ‌రుతో అస‌లు సీటు క‌నిపించ‌లేదు. అత‌డి ముందు, వెనుక నంబ‌ర్లు అయిన J-65 తర్వాత J-67 ఉంది. కానీ J-66 నంబ‌ర్ సీటు లేదు. దీంతో అత‌డు సిబ్బందికి విష‌యాన్ని చెప్పాడు. వారు వ‌చ్చి చూసిన‌ప్ప‌టికీ ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

Also Read: Kavya Maran Erupts In Joy : కావ్య పాప మ‌ళ్లీ నవ్వింది.. ప‌క్క‌న ఉన్న అమ్మాయి ఎవ‌రంటే?

దీంతో అత‌డు మ్యాచ్ మొత్తం నిల‌బ‌డే చూశాడు. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (HCA) వ‌ల్లే త‌న‌కు ఈ దుస్థితి ఎదురైంద‌ని ఎక్స్ వేదిక‌గా తెలిపారు. త‌న‌కు క‌లిగిన అసౌక‌ర్యానికి న‌ష్ట‌ప‌రిహారంగా త‌న టికెట్ డ‌బ్బులు వాప‌స్ చేయాల‌ని డిమాండ్ చేశాడు. అత‌డి ట్వీట్ వైర‌ల్‌గా మారింది.