Site icon HashtagU Telugu

India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

Team India Imresizer

Team India Imresizer

కరేబియన్ టూర్ ను టీమిండియా ఘనంగా ముగించింది. వన్డే సిరీస్ ను గెలిచిన భారత్ తాజాగా టీ ట్వంటీ సీరీస్ లో 4-1 తో విజయం సాధించింది. నామమాత్రపు చివరి మ్యాచ్ లోనూ భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. రోహిత్ కు రెస్ట్ ఇవ్వడంతో భారత జట్టుకు హార్ధిక్ పాండ్యా సారథిగా వ్వవహరించాడు. సూర్య స్థానంలో ఇషాన్ కిషన్ కు అవకాశం వచ్చింది. కీలక ఆటగాళ్లను కోల్పోయినా ఫోర్లు, సిక్సర్లకు ఏమాత్రం లోటు రాలేదు. శ్రేయాస్ అయ్యర్ 40 బంతుల్ల 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 దీపక్ హుడా 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38, హార్ధిక్ పాండ్యా 16 బంతుల్లో 28 రన్స్ చేశారు. లు చెలరేగడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

భారీ లక్ష్య చేధనలో విండీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక పోయింది.టీమిండియా స్పిన్ త్రయం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ లు విండీస్ ను కుప్పకూల్చారు..హెట్ మేయర్ ఒక్కడే చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది..అతనికి సపోర్ట్ చేసే వాళ్లే లేకుండా పోయారు. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా హెట్మెయర్ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. బిష్ణోయ్ అద్భుతం చేస్తే ఆ తర్వాత కుల్దీప్ ఆ మ్యాజిక్ ను కొనసాగించాడు. .
బిష్ణోయ్ 16వ ఓవర్లో విండీస్ ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు. విండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్.. ఐదు టీ20ల సిరీస్ ను 4-1తో గెలుచుకుంది.