మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ (Bill Gates) అల్లుడు నాయెల్ నాజర్ ( Nayel Nassar) పారిస్ ఒలింపిక్స్ (Paris 2024 Olympics) పోటీల్లో పాల్గొంటున్నారు. ఈజిప్టు తరఫున ఆయన ఈక్వెస్ట్రియన్ పోటీల్లో తలపడుతున్నారు. నాజర్ ఒలింపిక్స్లో పాల్గొనడం ఇది మూడోసారి. కాగా 2021లో బిల్ గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ను నాజర్ వివాహమాడారు. ఐదేళ్ల ప్రాయం నుంచే ఆయన గుర్రపు స్వారీ చేయడం ప్రారంభించారు. చికాగోలో ఈజిప్షియన్ తల్లిదండ్రులకు జన్మించిన నాజర్ కువైట్‌లో పెరిగాడు. చిన్న వయస్సు నుండి గుర్రపు స్వారీ చేయడం అలవాటుగా చేసుకున్నాడు. నాజర్ 2013లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో పట్టభద్రుడయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా, చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా, చారిత్రక కట్టడాల మధ్యలో సెన్ నదిపై ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. నదికి రెండు వైపులా కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు అద్భుతంగా కొనసాగాయి. ఇక ఫస్ట్ డే భారత షూటర్లకు నిరాశ తప్పలేదు. 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రమిత- అర్జున్ బబుతా, ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్ జోడీలు ఫైనల్‌కు వెళ్లలేకపోయాయి. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రమిత-అర్జున్ బబుతా జోడీ 628.7 స్కోర్‌తో ఆరో స్థానంలో నిలిచింది. మరో జోడీ వలరివన్- సందీప్ సింగ్ 626.3 పాయింట్లతో 12 స్థానంలోనే నిలిచింది. దీంతో టాప్-4లో ఉన్న వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
ఇక రోయింగ్ మెన్స్ సింగిల్ స్కల్స్ హీట్స్‌లో భారత్ అథ్లెట్ బాల్‌రాజ్ పన్వర్ నాలుగో స్థానంలో నిలిచాడు. హీట్ 1లో అతడు 7:07.11 నిమిషాల్లో రేసును కంప్లీట్ చేశాడు. దీంతో నాలుగో స్థానంలో ఉండటం వల్ల రెపిచేజెస్ రౌండ్‌కు చేరుకున్నాడు. అంటే సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు వెళ్లేందుకు అతడికి మరో ఛాన్స్ దక్కింది. ఈ సీజన్లో తొలి పతకం సాధించిన జట్టుగా కజకిస్థాన్ నిలిచింది. 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ షూటింగ్ విభాగంలో ఆ జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. మరోవైపు తొలి బంగారు పతకం సొంతం చేసుకున్న జట్టుగా చైనా నిలిచింది. ఫైనల్ పోరులో రిపబ్లిక్ ఆఫ్ కొరియాపై 16-12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
Read Also : DK Shiva Kumar : పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గంగా హారతి తరహాలో కావేరీ హారతి