IPL First Match : ఐపీఎల్ సీజన్ ఆరంభ తేదీ ఎప్పుడో తెలుసా ?

IPL First Match : క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ పై మేజర్ అప్ డేట్ వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
IPL Teams To Finalise Retentions

IPL Teams To Finalise Retentions

IPL First Match : క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ పై మేజర్ అప్ డేట్ వచ్చింది. ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ ప్రారంభ తేదీపై లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ కీలక ప్రకటన చేశారు.  ఐపీఎల్ తొలి మ్యాచ్(IPL First Match) మార్చి 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగొచ్చన్నారు. ప్లేఆఫ్ మ్యాచ్‌లు కలుపుకొని టోర్నీలో మొత్తం 74 మ్యాచ్​లు జరగనున్నాయని తెలిపారు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ మార్చి 22న ప్రారంభమై మే 26న ముగుస్తుందని తెలుస్తోంది. షెడ్యూల్‌ను దశలవారీగా ప్రకటించాలని లీగ్‌ నిర్వహకులు యోచిస్తున్నారు. ముందు కొన్ని మ్యాచ్‌లకు షెడ్యూల్‌ను ప్రకటించి, మిగతా మ్యాచ్‌లకు మరో తేదీన షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు.ఐపీఎల్​ ప్రారంభమయ్యాక ఇప్పటిదాకా దేశంలో 3 సాధారణ ఎన్నికలు జరిగాయి. సెక్యురిటీ కారణాల వల్ల అందులో 2009 ఎడిషన్​​ పూర్తి టోర్నమెంట్​ను బీసీసీఐ సౌతాఫ్రికాలో నిర్వహించింది. ఆ తర్వాత 2014 ఎడిషన్​లో తొలి 20 మ్యాచ్​లను బీసీసీఐ యూఏఈ (దుబాయ్)లో జరిపింది. ఇక ఎన్నికల తర్వాత టోర్నీని మళ్లీ భారత్​కు షిఫ్ట్ చేసింది. కానీ, 2019లో మాత్రం పూర్తి టోర్నీని సక్సెస్​ఫుల్​గా భారత్​లోనే నిర్వహించింది.

We’re now on WhatsApp. Click to Join

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ఎన్నికల సంఘం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధమాల్ తెలిపారు. సీఈసీ నుంచి ఎన్నికల తేదీ ప్రకటన వెలువడిన వెంటనే లీగ్‌ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఎన్నికల ముందు ఒక దశలో.. ఎన్నికల తర్వాత మరో దశలో మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటున్నట్టు చెప్పారు. భారత్‌లోనే ఐపీఎల్ జరిగేలా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత ఎజెన్సీలతో కలిసి పని చేస్తున్నట్టు ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ముందుగానే టోర్నీని ముగించనున్నారు. ఈ సారి డబుల్ హెడర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు, ఫలితాలు వెల్లడించే సమయంలో మ్యాచ్‌లు లేకుండా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.

Also Read :Supreme Court : బీజేపీకి షాక్.. ఆ నగరం మేయర్‌ను మార్చేసిన సుప్రీంకోర్టు

  Last Updated: 20 Feb 2024, 05:58 PM IST