Harmanpreet Kaur: హ‌ర్మ‌న్‌ప్రీత్ కు బిగ్ షాక్.. మ్యాచ్ ఫీజులో భారీగా కోత

హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ .. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో విజయవంతమైన ఆటతీరు ఆమె సొంతం.

  • Written By:
  • Updated On - July 24, 2023 / 11:46 AM IST

హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ .. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో విజయవంతమైన ఆటతీరు ఆమె సొంతం. తన బ్యాటింగ్ తో ఇండియాకు ఎన్నో విజయాలను అందించింది. కానీ ఆమె వ్యవహర శైలీ మాత్రంపై ఎప్పుడూ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మైదానంలో దూకుడుగా ఉండటం తప్పు లేదు. కానీ అమర్యాదగా వ్యవహరించడం తప్పేనని క్రికెట్ ప్రేక్షకులతో పాటు క్రికెట్ సంఘాలు మండిపడుతున్నాయి.

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో అంపైర్స్‌ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీమ్ ఇండియా ఉమెన్స్ జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజులో కోత ప‌డింది. అంతే కాకుండా ఆమెపై నిషేదం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మూడే వ‌న్డేలో భార‌త్ సుల‌భంగా గెలిచేలా క‌నిపించింది. విజ‌యానికి చేరువ అవుతోన్న స‌మ‌యంలో చివ‌రి ఆరు వికెట్ల‌ను వెంట వెంట‌నే కోల్పోవ‌డంతో వ‌న్డే మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ ఔట్ విష‌యంలో అంపైర్స్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ ఔట్ విష‌యంలో బంగ్లా ప్లేయ‌ర్స్ అప్పీల్ చేయ‌డానికంటే ముందే అంపైర్ ఆమెను ఔట్‌గా ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అంపైర్ నిర్ణ‌యంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన హ‌ర్మ‌న్ ప్రీత్ త‌న బ్యాట్‌తో స్టంప్స్‌ను బ‌లంగా కొట్టింది. ట్రోఫీ ప్ర‌జెంటేష‌న్ టైమ్‌లో బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల‌తో ఫొటో దిగుతోండ‌గా మీతో పాటు అంపైర్స్‌ను కూడా తెచ్చుకుంటే బాగుండేదంటూ హ‌ర్మ‌న్ ప్రీత్ అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. అంపైర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టిన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత ప‌డిన‌ట్లు స‌మాచారం.ఫైన్‌తో పాటు ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్స్ విధించిన‌ట్లు తెలిసింది. మ‌రో డీమెరిట్ పాయింట్ వ‌స్తే హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌పై ఓ టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వ‌న్డేలు, టీ20 మ్యాచ్‌లు నిషేధం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. మున్ముందు హర్మన్ ప్రీత్ తన వ్యవహర శైలీ మార్చుకోకపోతే కఠిన చర్యలు సైతం ఎదుర్కోవాల్సిందే. ప్రతిభ ఉండి కూడా ఎంతోమంది క్రికెటర్లు అమర్యాద కారణంగా అర్ధాంతరంగా కెరీర్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

Also Read: Vijayashanthi: బీజేపీ పై రాములమ్మ అసంతృప్తికి కారణమిదే!