World Cup: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ప్రమాదానికి గురయ్యాడు. గోల్ఫ్ కార్ట్ వాహనంపై నుంచి కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెబుతున్నప్పటికీ పూర్తి వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. దీంతో శనివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి మినహా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ధర్మశాల వేదికగా అక్టోబర్ 28న న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా చివరి మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత తదుపరి మ్యాచ్ కు నాలుగు రోజుల విరామం ఉండడంతో ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. గోల్ఫ్ ఆడుతూ మ్యాక్స్‌వెల్‌కు గాయాలైనట్లు సమాచారం. అతను గోల్ఫ్ కార్ట్ వెనుక నుండి పడిపోవడంతో తలకు గాయమైనట్లు తెలుస్తోంది. కాగా, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ (44 బంతుల్లో 106 పరుగులు) సాధించిన సంగతి తెలిసిందే.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కరోజే 15 వేల మంది కొత్త ఓటర్లు