Rohit Sharma: భారత్ కు బిగ్ షాక్ ..రోహిత్ కు కరోనా

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలిం‍ది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డాడు.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 10:45 AM IST

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలిం‍ది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో రోహిత్‌కు పాజిటివ్‌ తేలింది. ప్రస్తుతం రోహిత్‌ జట్టు హోటల్‌లో ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా బీసీసీఐ వెల్లడించింది. శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పాజిటివ్‌ తేలింది. అతడు ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు. అదే విధంగా అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది.
ప్రస్తుతం లీసెస్టర్ షైర్ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచులో ఆడుతున్న రోహిత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. కాగా రోహిత్‌ వారం రోజులు పాటు ఐషోలేషన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూలై1న జరగబోయే నిర్ణయాత్మక టెస్టుకు రోహిత్‌ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్ మొదలయ్యే లోగా అత‌డు కోలుకుంటాడా లేదా అన్న‌ది తెలియ‌డం లేదు. ఒక‌వేళ అత‌డు అందుబాటులో లేక‌పోతే కెప్టెన్ బాధ్య‌త‌లు ఎవ‌రు చేప‌డుతున్నార‌ని ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు అత‌డు లీసెస్ట‌ర్‌షైర్‌తో జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్ ఆడడంతో ఈ వైర‌స్ ఇత‌ర ప్లేయర్స్ కు సంక్ర‌మించే అవ‌కాశం కూడా కనిపిస్తోంది. మిగిలిన ప్లేయర్స్ కొవిడ్ టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉంది. గ‌త ఏడాది జ‌ర‌గాల్సిన ఈ టెస్ట్ క‌రోనా కార‌ణంగా వాయిదాప‌డింది. ఇప్పుడు కూడా వ‌రుస‌గా టీమ్ ఇండియా ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డుతుండ‌టంతో ఏం జ‌రుగుతుందోన‌ని బీసీసీఐ, ఈసీబీ ఆందోళన చెందుతున్నాయి.