Site icon HashtagU Telugu

Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్ న్యూస్.. నేటి మ్యాచ్ కు బెన్ స్టోక్స్ సిద్ధం..!

Ben Stokes

Resizeimagesize (1280 X 720) (1)

ఐపీఎల్ 2023 16వ సీజన్‌లో 4 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ఈ సీజన్ చాలా మెరుగ్గా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచిన చెన్నై జట్టు ప్రస్తుతం 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే, బెన్ స్టోక్స్ (Ben Stokes) ఫిట్‌నెస్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగే మ్యాచ్ కు ముందు చెన్నై జట్టుకు శుభవార్త వెలువడింది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమైన బెన్ స్టోక్స్ జట్టు తరఫున తొలి 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడగలిగాడు. దీని తర్వాత అతను కాలు గాయం కారణంగా చివరి 3 మ్యాచ్‌లలో ఆడలేదు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు బెన్ స్టోక్స్ గురించి వస్తున్న వార్తల ప్రకారం అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. దింతో నేడు (శుక్రవారం) హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో బెన్ స్టోక్స్ బరిలోకి దిగనున్నాడు. స్టోక్స్ రాకతో చెన్నై జట్టు బలం మరింత పెరగనుంది.

Also Read: DC vs KKR: ఎట్టకేలకు విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాణించిన డేవిడ్ వార్నర్ ..!

నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగనున్న మ్యాచ్ విషయానికొస్తే.. మోకాలి గాయంతో నిత్యం పోరాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ధోనీ ఈ మ్యాచ్ కు దూరం అయితే బెన్ స్టోక్స్‌కు జట్టు కెప్టెన్ గా వ్యవహరించవచ్చు.

చెన్నై జట్టులోని పలువురు ఆటగాళ్లకు గాయాలు

ఈ సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమైన కైల్ జేమ్సన్, ముఖేష్ చౌదరి రూపంలో 2 పెద్ద ఎదురుదెబ్బలను చవిచూసింది. అదే సమయంలో దీపక్ చాహర్, సిసంద మగల కూడా గాయం కారణంగా బెంచ్ కే పరిమితం అయ్యారు.