T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197

టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగగా,, శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో శివాలెత్తించాడు. దూబే 24 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటాడు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

T20 World Cup: సూపర్-8లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండవ మ్యాచ్ ఆడుతోంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగగా,, శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో శివాలెత్తించాడు. దూబే 24 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటాడు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

టోర్నీలో ఇప్పటివరకు విఫలమైన కోహ్లి.. కోల్పోయిన ఫామ్‌ను పుంజుకున్నాడు. విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 132.14 స్ట్రైక్ రేట్‌తో 37 పరుగులు చేశాడు. ఈ సమయంలో కింగ్ 1 ఫోర్, 3 సిక్సర్లు బాదాడు. దీంతో విరాట్ చరిత్ర సృష్టించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్‌లో 3000కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.రోహిత్ 23, పంత్ 36 పరుగులతో రాణించారు. ఫలితంగా టీమిండియా బంగ్లాదేశ్ కు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది.

Also Read; T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197