Sunil Gavaskar: టీ20 నుంచి టెస్టు క్రికెట్‌కు మారడం టీమిండియా ఆటగాళ్లకు అంత ఈజీ కాదు: సునీల్ గవాస్కర్

టీ20 నుంచి టెస్టు క్రికెట్‌కు మారడం భారత్‌కు అతిపెద్ద సవాల్ అని భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అన్నారు.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 10:27 AM IST

Sunil Gavaskar: టీ20 నుంచి టెస్టు క్రికెట్‌కు మారడం భారత్‌కు అతిపెద్ద సవాల్ అని భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఐపీఎల్‌ ఆడిన తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం దాదాపు జట్టులోని ఆటగాళ్లందరూ లండన్‌కు వెళ్లిపోయారు. గత రెండు నెలల్లో ఛెతేశ్వర్ పుజారా మాత్రమే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడుతున్నాడని, వారం రోజుల్లో భారత్ వేగంగా మార్పులు చేయాల్సి ఉంటుందని గవాస్కర్ అన్నారు.

టెస్టుల్లో ఆడేందుకు ఆటగాళ్లకు పరీక్ష

దాదాపు అందరూ టీ20 ఫార్మాట్ నుంచి టెస్టుకు మారడమే అతిపెద్ద పరీక్ష అని గవాస్కర్ అన్నారు. టెస్ట్ క్రికెట్ అనేది సుదీర్ఘమైన ఫార్మాట్. కాబట్టి ఇది పెద్ద ఛాలెంజ్ అవుతుందని భావిస్తున్నాను. ఇంగ్లిష్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి పుజారా మాత్రమే ఆడుతున్నాడు అని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడిన ఏకైక ఆటగాడు పుజారా మాత్రమేనని గవాస్కర్ చెప్పారు. కాబట్టి ఇది భారత్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తన అద్భుతమైన ప్రదర్శన కారణంగా అజింక్య రహానే భారత టెస్ట్ జట్టులో తిరిగి చోటు సాధించాడు.

Also Read: MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్

రహానేకు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉంది

రహానే గురించి గవాస్కర్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడిన అనుభవం తనకు చాలా ఉందని ఫైనల్‌లో రాణించేలా ప్రేరేపిస్తాడని చెప్పారు. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం, ఇంగ్లండ్‌లో పరుగులు చేసిన అనుభవం అతనికి ఉంది. కాబట్టి అతను నెం.5లో జట్టుకు ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాడని నేను భావిస్తున్నాను అన్నారు.

రహానేకి మంచి అవకాశం

ఇంకా రహానే తనను తాను నిరూపించుకునే అవకాశం ఉందని నేను ఆశిస్తున్నాను అని గవాస్కర్ చెప్పారు. రహానేలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. ఇది అతనికి గొప్ప అవకాశం. తన అనుభవంతో ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాడని, భారత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందగలడని ఆశిస్తున్నానని గవాస్కర్ పేర్కొన్నారు.