IPL 2023: పంజాబ్‌ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. కాగా.. కాలు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని జానీ బెయిర్‌స్టో రూపంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 12:09 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. కాగా.. కాలు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని జానీ బెయిర్‌స్టో రూపంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిర్‌స్టో గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడడం లేదు. జానీ బెయిర్‌స్టో గత సంవత్సరం సెప్టెంబర్‌లో స్నేహితులతో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు గాయంతో బాధపడ్డాడు. అందులో అతని ఎడమ కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అతని చీలమండ కూడా మెలితిరిగింది. ఈ గాయం తర్వాత, అతను లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది.

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెయిర్ స్టో ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. గోల్ఫ్ ఆడుతూ… గాయపడ్డ బెయిర్ స్టోకు లిగమెంట్ డ్యామేజీ అయిందట. దీంతో అతడు ఐపీఎల్‌కు మొత్తం దూరం కానున్నట్లు బ్రిటీష్ మీడియా పేర్కొంది. ఇటీవలే జరిగిన మినీ వేలంలో బెయిర్ స్టోను పంజాబ్ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకు ముందు అతడు SRH తరఫున ఆడాడు.

Also Read: Delhi Capitals: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. శస్త్రచికిత్స తర్వాత కాలులో మెటల్ ప్లేట్ చొప్పించబడిన జానీ బెయిర్‌స్టో మరికొంత కాలం మైదానానికి దూరంగా ఉండబోతున్నాడు. తద్వారా అతను తన కోలుకోవడంపై పూర్తిగా దృష్టి పెట్టగలడు. అయితే బెయిర్‌స్టోకు సంబంధించి ఇప్పటి వరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పంజాబ్ కింగ్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడనుంది. ఏప్రిల్ 1న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో జట్టు తమ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. గతేడాది జరిగిన మెగా వేలంలో రూ.6.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి పంజాబ్ కింగ్స్ బెయిర్‌స్టోను కొనుగోలు చేసింది. 2019లో జానీ బెయిర్‌స్టో తొలిసారిగా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 39 మ్యాచ్‌లు ఆడాడు. 1291 పరుగులు చేయగా.. ఇందులో 9 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. గత సీజన్‌లో బెయిర్‌స్టో 11 మ్యాచ్‌లు ఆడి.. 253 పరుగులు చేశాడు.