Bhuvaneswar Kumar @208 :భువి గంటకు 208 కి.మీ. వేగంతో…నిజమెంత ?+

ఒక్కోసారి సాంకేతిక తప్పిదాలతో సాధ్యం కానివి కూడా జరిగినట్టు కనిపిస్తాయి. భారత్, ఐర్లాండ్ మధ్య ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 03:54 PM IST

ఒక్కోసారి సాంకేతిక తప్పిదాలతో సాధ్యం కానివి కూడా జరిగినట్టు కనిపిస్తాయి. భారత్, ఐర్లాండ్ మధ్య ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అసలు విషయం తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పేరిట రికార్డు ఉంది. 161.3 కిమీ వేగంతో బాల్ వేసి అక్తర్ రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ భువనేశ్వర్… అక్తర్ ను మించిపోయే వేగంతో బౌలింగ్ చేశాడు. 208 కిమీ వేగంగా బౌలింగ్ చేశాడు. అయితే ఇదంతా నిజం అనుకుంటున్నారా … కాదు.
ఐర్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా స్పీడో మీటర్ సరిగా పనిచేయలేదు. దాంతో అతడు వేసిన బంతిని 208 కిమీ గా చూపించింది. అదే ఓవర్ లో మరో బంతిని 201 కిమీగా స్పీడోమీటర్ లో కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ రికార్డును సృష్టించాడని క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. షోయబ్ అక్తర్, ఉమ్రాన్ మాలిక్ లను మించిపోయాడని, వారి రికార్డులను చెరిపివేశాడంటూ చెబుతున్నారు. వారు ఎవరు అంటూ క్రియేట్ చేసిన ఫన్నీ మీమ్స్ నెట్టింట క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో ఐర్లాండ్ నిర్దేశించిన 109 పరుగుల టార్గేట్ ను భారత్ 9.2 ఓవర్లలో చేదించింది.