IPL 2025 Auction: రెండు రోజులపాటు జరిగిన ఐపీఎల్ వేలం (IPL 2025 Auction) ముగిసింది. ఈ వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లతో పాటు దేశవాళీ క్రికెటర్లు సైతం కోటీశ్వరులయ్యారు. ఫామ్‌తో ఇబ్బంది పడుతూ జట్టుకు దూరమైన ఆటగాళ్లపైన కూడా జట్లు కోట్ల వర్షం కురిపించాయి. కొన్ని జట్లు తమకు అవసరమైన ఆటగాళ్ల కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ సొంతం చేసుకున్నాయి.
IPL 2025 మెగా వేలంలో నవంబర్ 25వ తేదీ సోమవారం రెండో రోజు ఆటగాళ్ల వేలం పాట జరిగింది. మొదటి రోజు వేలం సమయంలో RCB పెద్దగా యాక్టివ్‌గా లేదు. అయితే ఆ మరుసటి రోజే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ప్లాన్‌ను చూపించింది. అయితే భారీగా డబ్బు చెల్లించి భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో పాటు ముఖేష్ కుమార్, ఆకాష్‌దీప్‌లపై కూడా కాసుల వర్షం కురిపించాయి జట్లు.
Also Read: Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే కోటీశ్వరుడైన యంగ్ ప్లేయర్.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
లక్నో వేలంను ఆర్సీబీ అడ్డుకుంది
రెండో రోజు వేలంలో భువనేశ్వర్ కుమార్‌పై బిడ్డింగ్ జరిగింది. అయితే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే లక్నో, ముంబై మధ్య రూ.10 కోట్ల వరకు బిడ్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత ముంబై వేలం నిలిపివేసింది. దీంతో భువీ లక్నోకు వెళ్లటం ఖాయమని భావించారు. అయితే ఆ తర్వాత ఆర్సీబీ రంగంలోకి దిగి భువీని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ముకేశ్ కుమార్ నిలబెట్టుకున్నాడు
వేలం రెండో రోజు వేలంలో ముఖేష్ కుమార్ పేరు వచ్చింది. అయితే అతడిని కొనుగోలు చేసేందుకు పలు బృందాలు బెట్టింగ్‌లు కట్టాయి. అయితే చివరికి ఢిల్లీ అతడిని 8 కోట్ల రూపాయలకు RTM కింద ఉంచుకుంది.
ఆకాశ్‌దీప్‌పై లక్నో భారీ పందెం
లక్నో సూపర్ జెయింట్‌లు తొలి రోజు నుంచే ఆటగాళ్లపై రికార్డు ధరలు బిడ్ వేశాయి. అయితే రెండో రోజు స్టార్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్‌పై లక్నో భారీ పందెం వేసింది. 8 కోట్లకు అతడిని జట్టులో చేర్చుకుంది.